
కాపుల ఓబీసీ డిమాండ్‌కు మద్దతు: హార్దిక్ పటేల్
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాపులను ఓబీసీలో కలపాలనే పోరాటానికి మద్దతు ఇవ్వనున్నట్టు పటీదార్ అనామత్ ఆందోళన సమితి నేత హార్దిక్ పటేల్ బుధవారమిక్కడ చెప్పారు. కుర్మీ, గుజ్జర్, మరాఠా, పటేళ్లను సంఘటిత పర్చేందుకు అఖిల భారతీయ పటేల్ నవనిర్మాణ్ సేన ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఏపీ, తెలంగాణలో కూడా ఓబీసీ రిజర్వేషన్లు కావాలంటూ కాపులు పోరాటాలు చేస్తున్నారని, వారిని కూడా కలుపుకుపోతామన్నారు.