ఢిల్లీ: పటేళ్ల రిజర్వేషన్ పోరాట నాయకుడు హార్దిక్ పటేల్కు సుప్రింకోర్టులో చుక్కెదురైంది. శుక్రవారం హార్దిక్పై నమోదైన రాజద్రోహం కేసును విచారించిన సుప్రీంకోర్టు అతని జనవరి 5 వరకు రిమాండ్ విధించింది. ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే మ్యాచ్ సందర్భంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో హార్దక్ మాట్లాడుతూ.. అవసరమైతే పోలీసులను చంపాలని పిలుపునివ్వడంతో ఆయనపై రాజద్రోహం కేసు నమోదైంది.
గుజరాత్ హై కోర్టు ఈ కేసుని విచారణకు స్వీకరించడంతో హార్దిక్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారణ సందర్భంగా జనవరి 5 వతేదీ లోపు హార్దిక్పై చార్జ్షీట్ నమోదు చేయాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 19న అరెస్టైన హర్దిక్ ఇప్పటి వరకు పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు.