సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న పటీదార్ల నాయకుడు హార్దిక్ పటేల్ తనపై ‘మార్పిడి చేసిన సెక్స్ సీడీ’ని భారతీయ జనతా పార్టీ త్వరలోనే విడుదల చేస్తుందని చెప్పిన విషయం తెల్సిందే. ఆయన చెప్పినట్లు ఒకటి కాదు, ఆ పార్టీ రెండు వీడియో సీడీలను విడుదల చేసింది. ఒక వీడియోలో హార్దిక్ పటేల్ ఓ మహిళతో సెక్స్‌లో పాల్గొన్నట్లు మరో వీడియోలో హార్దిక్ పటేల్ ఆల్కహాల్ సేవిస్తున్నట్లు ఉంది. ‘హార్దిక్ ఎక్స్‌పోజ్డ్’ అనే హాష్టాగ్‌తో బీజేపీ కార్యకర్తలు, వారి మద్దతుదారులు ఈ వీడియోలపై ట్వీట్లు చేస్తుండగా, ‘రియల్ ట్రూత్ ఆఫ్ హార్దిక్ పటేల్’, బేషరమ్ హార్దిక్ పటేల్’ అంటూ గుజరాత్ బీజేపీ ఐటీ, సోషల్ మీడియా విభాగం కన్వీనర్‌గా చెప్పుకుంటున్న వ్యక్తి ఈ వీడియాలకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఈ వీడియోలో ఉన్నది తాను కాదని హార్దిక్ పటేల్ ఇప్పటికే చెప్పుకోగా, ఆయనైతే మాత్రం తప్పేముందని, అది పూర్తి వ్యక్తిగత అంశమని ఆయనకు మద్దతిస్తున్నవారు కౌంటర్ ట్వీట్లు చేస్తున్నారు. సెక్స్ వీడియోలో కనిపిస్తున్నది హార్దిక్ పటేల్ అవునా, కాదా ? చర్చనీయాంశమే కాదని, ఆయనే అనుకుంటే ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని ‘ప్రైవసీ ప్రాథమిక హక్కు’ అనే వారంతా వాదిస్తున్నారు. ఇటీవల బీజేపీ చత్తీస్‌గఢ్‌లో వ్యవహరించిన తీరు, గుజరాత్‌లో వ్యవహరించిన తీరుకు పూర్తి విరుద్ధంగా ఉంది. బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రి సెక్స్‌లో పాల్గొన్న వీడియోను కలిగి ఉన్నందుకు మాజీ బీబీసీ జర్నలిస్ట్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ జర్నలిస్ట్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నానా యాగి చేయడంతో ఆ జర్నలిస్ట్‌పై పోలీసులు కేసు కూడా పెట్టారు.
ఇక్కడ బీజేపీ మంత్రి వ్యక్తిగత స్వేచ్ఛకు బీజేపీ కార్యకర్తలు అండగా నిలిచారు. జర్నలిస్టులను టార్గెట్ చేస్తున్న సదురు మంత్రిపై స్టింగ్ ఆపరేషన్‌కు వెళ్లడంతో ఆ జర్నలిస్ట్ మంత్రిగారి శృంగారలీలకు సంబంధించిన క్లిప్పింగ్ దొరికింది. ఇక ఆ విషయాన్ని అంతటితో ఆపేస్తే నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ మహిళపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నిఘా ఏర్పాటుచేసిన ‘స్నూప్‌గేట్ స్కామ్’లో బీజేపీ వ్యక్తిగత స్వేచ్ఛను గాలికొదిలేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్ధించారు. ఆధార్‌కు సంబంధించి ‘ప్రైవసీ’పై సుప్రీం కోర్టులో జరిగిన వాదనల సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారతీయులకు వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు కాదని వాదించింది.
అంటే బీజేపీ ఎప్పటికప్పుడు వ్యక్తిగత ప్రైవసీపై తన వైఖరిని మార్చుకుంటోంది. అంటే ఎప్పటి ఏ వైఖరి ప్రయోజనకరమో అప్పటికీ ఆ వైఖరిని అవలంబిస్తోందన్నమాట! ఇప్పుడు హార్దిక్ పటేల్ సెక్స్ వీడియోలో ఆయన పరస్పర అంగీకారంతోనే సెక్స్‌లో పాల్గొన్నట్లు స్పష్టం అవడమే కాకుండా మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు కూడా లేదని, అందుకని చత్తీస్‌గ«ఢ్‌లో పోలీసులు వ్యవహరించిన తీరులోనే ప్రజల్లోకి ఈ వీడియో విడుదల చేసిన, వీడియాను రహస్యంగా చిత్రీకరించిన వ్యక్తులపై కేసు పెట్టి వారిని అరెస్ట్ చేయాలని కూడా పటేల్ మద్దతుదారులు ట్వీట్లు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment