
సాక్షి, అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పటీదార్ ఉద్యమనేత హర్థిక్ పటేల్ సెక్స్ క్లిప్ వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఈ వీడియో క్లిప్‌లో ఉన్నది తాను కాదని హార్థిక్ పటేల్ చెబుతున్నా.. ఈ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ సీడీల్లో ఉన్నది ముమ్మాటికీ హార్థిక్ పటేలేనని ఆయన మాజీ అనుచరుడు అశ్విన్ తాజాగా వెల్లడించారు. అయితే, ఈ సెక్స్ సీడీల విషయమై ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సీడీల్లో ఉన్నది హార్థిక్ పటేలేనని, త్వరలో ఆయనకు సంబంధించిన మరిన్ని వీడియోలు బయటపెడతానని అశ్విన్ హెచ్చరించారు. హార్థిక్ అంతు చూస్తానని అశ్విన్ హెచ్చరించారు. అంతేకాకుండా హార్థిక్ పటేల్ అనుచరులతో కలిసి మద్యం తాగుతున్న వీడియోలు సైతం తాజాగా వెలుగుచూశాయి.
ఓ హోటల్ గదిలో ఓ యువతితో ఆయన సన్నిహితంగా గడుపుతున్న వీడియో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో ఉంది తాను కాదంటూ ఇప్పటికే హార్దిక్ ఇప్పటికే వివరణ ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందంటూ ఆయన విమర్శించారు. ఈ విషయంలో దళిత యువ నేత జిగ్నేశ్ మెవానీ సైతం స్పందించారు. హార్దిక్ సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ‘‘హర్దిక్ నీ వెంట నేనున్నా. శృంగారం అనేది ప్రాథమిక హక్కు. ఏకాంతానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు’ ’ అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అనంతరం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన వీడియోలో ఉన్నది అతనే అయినా తప్పేం కాదని.. ఆ వీడియోను ఎవరైతే బయటపెట్టారో వారిని హర్దిక్ కోర్టుకు ఇడ్చాల్సిందే అని జిగ్నేశ్ సలహా ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment