
అహ్మదాబాద్: పటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ రాసలీలలంటూ గుజరాత్ టీవీ చానెళ్లలో ప్రసారమైన వీడియోపై ఆయన ఘాటుగా స్పందించారు. ‘నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను నపుంసకుడిని కాదంటూ’ సమాధామిచ్చారు. తన పేరు చెడగొట్టడానికి బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, దీన్ని ఇతర దేశాల నుంచి అప్‌లోడ్ చేశారని, అదొక ఫేక్ వీడియో అంటూ వివరణ ఇచ్చారు. రాజకీయంగా దెబ్బతీసేందుకు బీజేపీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని ఫైర్ అయ్యారు. మార్ఫింగ్‌తో తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి కుట్ర తనపై జరుగుతుందని గతంలోనే తెలిపానని గుర్తు చేశారు. ఈ వీడియోపై న్యాయపరంగా పోరాటం చేస్తానన్నారు.
నాలుగు నిమిషాల వ్యవధి ఉన్న ఆ వీడియోలో ఓ మహిళతో 2017 మే 16న హార్ధిక్ పటేల్‌ను పోలిన వ్యక్తి రాసలీలలు జరిపినట్లు ఓ హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఇక పటీదార్ ఉద్యమనేత అయిన హార్ధిక్ పటేల్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతునిస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని హార్ధిక్ పటేల్.. కలిసిన సీసీటీవీ ఫుటేజ్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బ్లాక్‌సూట్‌కేస్ నిండా.. డబ్బుతో హార్ధిక్ పటేల్ వెనుదిగిరిగి వెళుతున్నాడంటూ.. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హార్ధిక్ పటేల్ మద్దతు ప్రకటించినందుకు ఈ మొత్తాన్ని రాహుల్ బహుమతిగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment