
అహ్మదాబాద్: పోలింగ్‌కు ముందు పటేదార్ అనామత్ అందోళన్ సమితి (పీఏఏఎస్)కు రాజీనామ చేసి షాక్ ఇచ్చిన దినేశ్ బంభూనియా మరో బాంబ్ పేల్చారు. హార్ధిక్‌ను పటీదార్లంతా ఓ ఐకాన్‌గా చూస్తున్నారని, అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ అతనిపై సెక్సు టేప్‌లు రావడం కలిచివేసిందన్నారు. తొలుత వచ్చిన సెక్సు టేపు మార్ఫింగ్ అయితే తరువాత వచ్చిన సీడీల మాటేమిటని ప్రశ్నించారు. ఈ విషయమే నన్ను చాలా బాధపెట్టిందని దినేశ్ బంభూనియా పేర్కొన్నారు. ఓ కమ్యూనిటీ లీడర్‌గా ఉన్న వ్యక్తిపై ఇలాంటివి రావడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
హార్ధిక్ కాంగ్రెస్ జెండా మోస్తున్నాడని, అధికారంలోకి వస్తే పటీదార్లకు రిజర్వేషన్ కల్పిస్తానని కాంగ్రెస్ హామి ఇవ్వలేదని, అయినా హార్ధిక్ కాంగ్రెస్‌కు ఎందుకు మద్దతు ఇస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. హార్ధిక్ కాంగ్రెస్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని దినేశ్ ఆరోపించారు. పటీదార్లు ఉద్యమ లక్ష్యం కోసం ఓటేయాలని దినేశ్ పిలుపునిచ్చారు. సరిగ్గా పోలింగ్ ఒక రోజు ముందు హార్ధిక్‌పై అత్యంత సన్నిహితుడైన దినేశ్ ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment