అహ్మదాబాద్: పటీదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ ఓ ఇంటివాడయ్యాడు. ఆయన తన చిన్ననాటి స్నేహితురాలు కింజల్ పారిక్‌ను ఆదివారం వివాహం చేసుకున్నారు. సురేంద్రనగర్ జిల్లా దిగ్సార్ గ్రామంలోని ఓ దేవాలయంలో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. పటేల్ సంప్రాదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు దగ్గరి బంధువులు, కొద్దిమంది స్నేహితులు హాజరయ్యారు. పెళ్లి అనంతరం హార్ధిక్ మాట్లాడుతూ.. ‘నా కుటుంబ జీవితంలో ఇది రెండో ఇన్నింగ్స్. ప్రతి ఒక్కరు సమాన అవకాశాలు పొందాలనేదే నా కోరిక. పురుషులకు, మహిళలకు సమాన హక్కులు ఉంటాయని.. నేను నా భార్యకు ప్రామిస్ చేశాను. ఇకపై మేమిద్దరం ఈ దేశ నవ నిర్మాణం కోసం పోరాడతామ’ని తెలిపారు.
కింజాల్, తాను ప్రేమించుకున్న విషయాన్ని హార్ధిక్ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. తొలుత కింజల్ తనకు ప్రపోజ్ చేసిందన్న హార్ధిక్.. పెద్దల అంగీకారంతో తాము పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిపారు. హార్ధిక్ స్వగ్రామం అహ్మదాబాద్ జిల్లాలోని చందన్ నగరి కాగా, కింజల్ ఆ ఊరికి సమీపంలోని విరంగం గ్రామానికి చెందినవారు. ప్రస్తుతం కింజల్ కుటుంబం సూరత్‌లో నివాసం ఉంటుంది. ఆమె తంద్రి దిలీప్ పారిక్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. డిగ్రీ పూర్తిచేసిన కింజల్.. ప్రస్తుతం లా చదువుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment