
సాక్షి, అహ్మదాబాద్: గుజరాత్ ఎన్నికల్లో విజయం తమదేనంటూ పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నేత హార్ధిక్ పటేల్ అన్నారు. ప్రజల నుంచి తమకు విశేష స్పందన వస్తుందని, వారి మద్ధతుతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి చూపిస్తామని హార్ధిక్ పేర్కొన్నారు. సోమవారం అహ్మదాబాద్‌లో నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా కాంగ్రెస్ మద్ధతుదారుడు, పటేల్ ఉద్యమనేత హార్ధిక్ మీడియాతో మాట్లాడారు.
దాదాపు లక్షమంది బైక్ ర్యాలీ పాల్గొన్నారని, ఇది తమ విజయానికి సంకేతమన్నారు. గుజరాత్ ఫలితాలపై బీజేపీలో వణుకు మొదలైందని, అందుకే కక్షకట్టి మరీ తన ర్యాలీలు, కార్యక్రమాలకు అధికార పార్టీ అడ్డుకుంటుందని ఆరోపించారు. రెండో దశ ఎన్నికల్లో ఆరు జిల్లాల ఓట్లు కీలకం కానున్నాయి. రోజురోజుకు ఉత్తర గుజరాత్‌కు పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకుని విస‍్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు గుజరాత్ రెండోదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ అహ్మదాబాద్‌లో పర్యటించవలసి ఉంది. అయితే శాంతి భద్రతలతో పాటుగా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment