మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం! | Mobile internet services banned across Gujarat after Hardik Patel's detention | Sakshi
Sakshi News home page

మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం!

Published Sat, Sep 19 2015 7:11 PM | Last Updated on Wed, Aug 29 2018 7:26 PM

మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం! - Sakshi

మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం!

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొనసాగుతున్న నిషేధాల పరంపర తారాస్థాయికి చేరింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో నేటి (శనివారం మధ్యాహ్నం) నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ పీసీ ఠాకూర్ ప్రకటించారు. ఈ నిషేధం ఎంతకాలం ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పటేల్ రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ అరెస్టు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్త కూడదనే ఉద్దేశంతోనే ముందస్తుగా మొబైల్ ఇంటర్నెట్ పై నిషేధం విధించామని డీజీపీ వివరించారు.

పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పాస్ (పటీదార్ ఆరక్షణ్ ఆందోళన్ సమితి) నాయకుడు హార్దిక్ పటేల్ సూరత్ నుంచి ప్రారంభించిన ఏక్తా యాత్రాను పోలీసులు అడ్డుకున్నారు. శనివారం ఉదయం సూరత్లో హార్దిక్ సహా మరో 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. హార్దిక్ అరెస్టుతో మళ్లీ ఆ రాష్ట్రంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. అన్ని జిల్లాల్లో పటేల్ కులస్తులు ఆందోళనలకు సిద్ధమయ్యారు. రాత్రిలోగా హార్దిక్ ను విడుదల చేయకుంటే జైల్ భరో కార్యక్రమానికి పూనుకుంటామని ఆనందిబెన్ సర్కారును హెచ్చరించారు.

 

గత ఆగస్టు 25న అహ్మదాబాద్ లో పటేళ్లు నిర్వహించిన భారీ సభ అనంతరం చెలరేగిన హింసలో 10 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనూ మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిషేధించింది గుజరాత్ ప్రభుత్వం. సర్కారు చర్యను హైకోర్టు కూడా సమర్థించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement