రాజద్రోహం కేసులో అరెస్టైన పటేళ్ల ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. దాదాపు 9 నెలల తర్వాత అతడికి బెయిల్ వచ్చింది. గుజరాత్ హైకోర్టు అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలల పాటు గుజరాత్ వెలుపల ఉండాలని ఆదేశించింది. రాజద్రోహం కేసులో సూరత్ పోలీసులు గతేడాది అక్టోబర్ లో అతడిని అరెస్టు చేశారు. బెయిల్ వచ్చినా హార్దిక్ జైల్లోనే ఉంటారని అతడి తరపు న్యాయవాది జుబిన్ భద్ర తెలిపారు. అతడిపై ఇతర కేసులున్నాయని చెప్పారు.
Published Fri, Jul 8 2016 5:30 PM | Last Updated on Fri, Mar 22 2024 10:59 AM
Advertisement
Advertisement
Advertisement