సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. ట్యాంపరింగ్ ఆరోపణలను ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. ముఖ్యంగా పటీదార్ ఉద్యమ నేత హర్దిక్ పటేల్ ఆరోపణలు చేస్తున్న క్రమంలో ఎన్నికల సంఘం ప్రధానాధికారి అచల్ కుమార్ జోతి కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చారు.
ఈవీఎంలు ట్యాంపరింగ్ గురి అయ్యే అవకాశమే లేదని ఆయన అంటున్నారు. గతంలో ఎన్నికల సంఘం మీడియా సమక్షంలోనే వీటిపై ప్రయోగపూర్వకంగా వివరణ ఇచ్చుకుంది. గుజరాత్ ఎన్నికల్లో వీవీపీఏటీ లను వినియోగించిన విషయం తెలిసిందే. అలాంటప్పుడు ట్యాంపరింగ్‌కు అవకాశమే లేదు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం సరికాదు అని ఆయన చెప్పారు.
కాగా, ఏటీఎంలు హ్యాకింగ్‌కు గురైనప్పుడు.. ఈవీఎంలు కూడా హ్యాకింగ్‌కు గురి అయి తీరతాయని హర్దిక్ ఈ ఉదయం కూడా తాజాగా వ్యాఖ్యలు చేశాడు. అయితే గుజరాత్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి బీబీ స్వాయిన్ కూడా వాటిని తీవ్రంగా ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment