పటేల్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ రేపు జైలు నుంచి బయటకు రానున్నారు. గత తొమ్మిది నెలలుగా దేశ ద్రోహం కేసులో శిక్షను అనుభవిస్తున్న హార్దిక్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
అహ్మదాబాద్: పటేల్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ రేపు జైలు నుంచి బయటకు రానున్నారు. గత తొమ్మిది నెలలుగా దేశ ద్రోహం కేసులో శిక్షను అనుభవిస్తున్న హార్దిక్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో సూరత్ లోని లజ్పూర్ జైలు నుంచి శుక్రవారం ఆయన విడుదల కానున్నారు. ఆయన జులై 17 వరకు ఆయన గుజరాత్ లో ఉంటారు. అనతరం ఆరు నెలల వరకు గుజరాత్ లోఉండరాదని కోర్టు స్పష్టం చేసింది.
గతేడాది పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి ఆధ్వర్యంలో గుజరాత్ లో పటేల్ లు తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కావాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ సందర్భంగా హార్దిక్ మాట్లాడుతూ... 'ఆందోళనకారులు ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? అవసరమైతే ఇద్దరు పోలీసులు చంపండి' అని పేర్కొనడంతో ఆయనపై దేశద్రోహం కేసును నమోదు చేశారు.