
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ డర్టీ పాలిటిక్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పటీదార్ ఉద్యమనేత హర్దిక్ పటేల్ సెక్స్ క్లిప్ అక్కడి మీడియాలో హల్ చల్ చేస్తుండటం.. దానినే ఆయుధంగా చేసుకుని బీజేపీ తీవ్ర విమర్శలకు దిగటం చూస్తున్నాం.
దీనిపై దళిత యువ నేత జిగ్నేశ్ మెవానీ స్పందించారు. హార్దిక్ సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు. ‘‘హర్దిక్ నీ వెంట నేనున్నా. శృంగారం అనేది ప్రాథమిక హక్కు. ఏకాంతానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదు’ ’ అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అనంతరం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన వీడియోలో ఉన్నది అతనే అయినా తప్పేం కాదని.. ఆ వీడియోను ఎవరైతే బయటపెట్టారో వారిని హర్దిక్ కోర్టుకు ఇడ్చాల్సిందే అని జిగ్నేశ్ సలహా ఇస్తున్నారు.
Dear Hardik Patel, don't worry. I m with you. And right to sex is a fundamental right. No one has right to breach your privacy.
— Jignesh Mevani (@jigneshmevani80) November 13, 2017
కాగా, వీడియోలో ఉంది తాను కాదంటూ ఇప్పటికే హార్దిక్ స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందంటూ ఆయన విమర్శించారు కూడా. జిగ్నేశ్ గుజరాత్‌లో దళిత హక్కుల కోసం పోరాడుతున్న నేత. గతేడాది ఉన్నావ్‌లో దళితులపై దాడి తర్వాత ఆ యువకులకు మద్దతుగా ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ మద్ధతుదారుడిగా ఉన్న జిగ్నేశ్ హార్దిక్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయటంలో తప్పేం లేదన్నది కొందరి వాదన.
Comments
Please login to add a commentAdd a comment