గుజారత్ పోలీసులు అక్కడ ఇంటర్నెట్ సేవలపై, సామాజిక అనుసంధాన వేధికలపై, మొబైల్ ఫోన్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు.
అహ్మదాబాద్: గుజారత్ పోలీసులు అక్కడ ఇంటర్నెట్ సేవలపై, సామాజిక అనుసంధాన వేధికలపై, మొబైల్ ఫోన్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు. దీంతో ఈ సేవలన్నీ అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గత కొద్ది రోజులుగా ఓబీసీల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలని హార్ధిక్ పటేల్ అనే యువనాయకుడి నేతృత్వంలో పటేళ్ల ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే.
ఆ ఉద్యమం కొద్దికొద్దిగా హింసాత్మకంగా మారుతుండటంతో పోలీసులు గత నెల 25న ఉద్యమం ప్రభావం ఉన్న ప్రాంతాల్లో వాట్సాప్, ఫేస్ బుక్ వంటి సోషల్ సైట్స్ తోపాటు ఇంటర్నెట్ సేవలు, మొబైల్ సేవలు నిషేధించారు. గత రెండు రోజులుగా అక్కడి పరిస్థితులు మెరుగవడంతో బ్యాన్ ఎత్తివేశారు.