
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని హార్ధిక్ పటేల్.. కలిసిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పటికే సంచలనంగా మారింది. తాజాగా రాహుల్‌ని కలిశాక.. హార్థిక్ పటేల్.. బ్లాక్‌సూట్‌కేస్ నిండా.. డబ్బుతో హార్ధిక్ పటేల్ వెనుదిగిరిగి వెళుతున్నాడంటూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అహ్మదాబాద్‌లోని ఓ హోటల్లో.. హార్థిక్ పటేల్, రాహుల్ గాంధీ భేటీ అయిన విషయం తెలిసిందే. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హార్ధిక్ పటేల్ మద్దతు ప్రకటించినందుకు ఈ మొత్తాన్ని బహుమతిగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాహుల్ గాంధీ, హార్థిక్ పటేల్ మధ్య 200 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరిందని.. అందుకే హార్థిక్ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియక సామాన్య జనాలు అమోమయానికి లోనవుతున్నారు. ఇదిలావుంటే.. సీసీటీవీ ఫుటేజ్ లీక్ కావడం అనేది వ్యక్తిగత ప్రైవసీ పాలసీకి విరుద్ధమని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.