గాంధీనగర్ : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్‌గాంధీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ‘అమిత్‌షా నేరస్తుడు’ అని లోక్‌సభ ఎన్నికల ర్యాలీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై అహ్మదాబాద్ హైకోర్టులో పరువునష్టం దావాకు పిటిషన్ దాఖలైంది. ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం ఆయన అహ్మదాబాద్ వచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్, మరికొంత మంది స్థానిక నేతలతో కలిసి ఓ రెస్టారెంట్లో భేటీ అయ్యారు. ఈ సమావేశం నేపథ్యంలో రాహుల్‌ను కలిసేందుకు జనం ఎగబడ్డారు.
మరోవైపు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దొంగలంతా మోదీలే ఎందుకవుతారని రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. దొంగలందరికీ మోదీ అన్న ఇంటిపేరు సహజంగా ఉంటుందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఇక ఆరెస్సెస్ శక్తులు రాజకీయ కుట్రల్లో భాగంగానే తనను టార్గెట్ చేస్తున్నాయని రాహుల్ ఆరోపిస్తున్నారు.
(చదవండి : నేను ఏ తప్పూ చేయలేదు: రాహుల్ గాంధీ)
Comments
Please login to add a commentAdd a comment