Ahmedabad High Court
-
కేజ్రీవాల్, సంజయ్ సింగ్‌కు అహ్మదాబాద్ కోర్టు నోటీసులు.. కారణం ఇదే..
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివాదంపై కేజ్రీవాల్‌కు మరోసారి షాక్ తగిలింది. ఈ వివాదంపై తాజాగా కేజ్రీవాల్ సహా ఆప్ ఎంపీ సంజయ్‌కు అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీటిపై మే 23వ తేదీలోపు సమాధాని ఇవ్వాలన్ని నోటీసుల్లో పేర్కొంది. వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ డిగ్రీ అర్హతను ప్రశ్నిస్తూ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ గుజరాత్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అయితే, వారు ఉద్దేశపూర్వకంగా గుజరాత్ యూనివర్సిటీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారని వర్సిటీ రిజిస్ట్రార్ పీయూష్ పటేల్ క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీటిపై మే 23లోగా స్పందించాలని ఆదేశిస్తూ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జయేశ్‌భాయ్ చోవాటియా ఆదేశించారు. ఇక, అంతకుముందు.. ప్రధాని మోదీ డిగ్రీపై కేజ్రీవాల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్స్ ఉంటే.. వర్సిటీ ఎందుకు బయటపెట్టడం లేదు. ఫేక్ సర్టిఫికెట్ కాబట్టే వర్సిటీ బయటపెట్టడం లేదేమో అని అన్నారు. ప్రధాని తమ విద్యార్థి అని ఢిల్లీ, గుజరాత్ వర్సిటీలు చెప్పుకునేవి కదా! అంటూ కామెంట్స్ చేశారు. ఇక, ఆప్ ఎంపీ సంజయ్.. ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదని వర్సిటీ నిరూపించిందన్నారు. -
హైకోర్టు జడ్డి మీదకు చెప్పులు...18 నెలల జైలు శిక్ష
అహ్మదాబాద్: 9 ఏళ్లుగా తన కేసును పెండింగ్‌లో పెడుతున్నారనే కోపంతో ఒక వ్యక్తి తీర్పు చెప్పే హైకోర్టు జడ్జిపైకి చెప్పులు విసిరాడు. దీనికి ప్రతిఫలంగా సదరు వ్యక్తి 18 నెలల జైలు శిక్ష అనుభవించనున్నాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్ హైకోర్టులో చోటుచేసుకుంది.వివరాలు.. అహ్మదాబాద్‌కు చెందిన బావాజీ అనే వ్యక్తి భయావదర్ మున్సిపాలిటీలో పరిధిలో రోడ్డుపై టీస్టాల్ నడుపుకునేవాడు. అయితే 2012లో రోడ్డు విస్తరణలో భాగంగా బావాజీని టీస్టాల్‌ను తీసేయాలంటూ మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై బావాజీ గోండల్ సెషన్స్ కోర్టు నుంచి టీస్టాల్ పడగొట్టకుండా స్టే ఆర్డర్‌ను తెచ్చుకున్నాడు. దీంతో భయావదర్ మున్సిపాలిటీ అధికారులు బావాజీ స్టే ఆర్డర్‌పై అహ్మదాబాద్ హైకోర్టుకు అప్పీల్ చేసింది. కాగా హైకోర్టు బావాజీ స్టే ఆర్డర్‌ను రద్దు చేసి అతని టీస్టాల్‌ను తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు బావాజీ టీ స్టాల్‌ను తొలగించారు. తనకు ఆదాయం వచ్చేదానిని కోల్పోయిన అతను మానసికంగా దెబ్బతిన్నాడు. అప్పటినుంచి తనకు న్యాయం జరగాలంటూ తెలిసినవారి నుంచి అప్పులు తీసుకుంటూ హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. తాజాగా మరోసారి కోర్టుకు వచ్చిన బావాజీ.. 9 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా కనీసం తన కేసును హియరింగ్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. జడ్డి స్థానంలో ఉన్న మిర్జాపూర్ గ్రామీణ కోర్టు చీఫ్ జ్యుడిషీయల్ మెజిస్ట్రేట్ వి.ఏ ధాదళ్పై చెప్పులు విసిరాడు. ఈ పరిణామాన్ని ఊహించని జడ్డి షాక్‌కు గురయ్యాడు.. కానీ అదృష్టవశాత్తు ఆ చెప్పులు ఆయనకు తగల్లేదు. అక్కడే ఉన్న పోలీసులు బావాజీని అదుపులోకి తీసుకున్నారు. భారతీయ శిక్షా స్మృతి కింద సెక్షన్ 353 ప్రకారం ప్రభుత్వ విధుల్లో ఉన్న వ్యక్తిపై ఉద్దేశపూర్వకంగా దాడికి దిగినందుకుగాను అతనికి 18 నెలల జైలు శిక్షను విధిస్తున్నట్లు తీర్పు చెప్పారు. ఇది సాధారణ శిక్ష మాత్రమే అని.. శిక్షాకాలంలో సత్ఫప్రవర్తనతో మెలిగితే విడుదల చేసే నిబంధన అతనికి వర్తింస్తుందని తీర్పునిచ్చారు. కాగా ప్రస్తుతం బావాజీని సోలా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చదవండి: జైలుకెళ్లడం కోసం ప్రధాని మోదీకి బెదిరింపు కాల్ చేశాడట..! -
హార్దిక్ పటేల్‌తో భేటీ అయిన రాహుల్
గాంధీనగర్ : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్‌గాంధీ గుజరాత్లో పర్యటిస్తున్నారు. ‘అమిత్‌షా నేరస్తుడు’ అని లోక్‌సభ ఎన్నికల ర్యాలీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై అహ్మదాబాద్ హైకోర్టులో పరువునష్టం దావాకు పిటిషన్ దాఖలైంది. ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం ఆయన అహ్మదాబాద్ వచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్, మరికొంత మంది స్థానిక నేతలతో కలిసి ఓ రెస్టారెంట్లో భేటీ అయ్యారు. ఈ సమావేశం నేపథ్యంలో రాహుల్‌ను కలిసేందుకు జనం ఎగబడ్డారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దొంగలంతా మోదీలే ఎందుకవుతారని రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. దొంగలందరికీ మోదీ అన్న ఇంటిపేరు సహజంగా ఉంటుందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఇక ఆరెస్సెస్ శక్తులు రాజకీయ కుట్రల్లో భాగంగానే తనను టార్గెట్ చేస్తున్నాయని రాహుల్ ఆరోపిస్తున్నారు. (చదవండి : నేను ఏ తప్పూ చేయలేదు: రాహుల్ గాంధీ) -
ప్రేమ వివాహం..విడాకులు..మళ్లీ పెళ్లి..
అహ్మదాబాద్ : తల్లితండ్రుల ఒత్తిడితో వేరొకరిని పెళ్లి చేసుకున్న తన భార్యను తిరిగి తన వద్దకు పంపాలని కోరుతూ 29 ఏళ్ల వ్యక్తి గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తమకు ఇటీవలే వివాహం జరిగిందని, తనకు విడాకులు ఇవ్వకుండానే తన భార్య వేరొకరిని పెళ్లి చేసుకుందని పిటిషనర్ ఆరోపించారు. కాగా యువతి తల్లితండ్రుల నుంచి బెదిరింపులు వస్తున్న క్రమంలో తమకు పోలీసు భద్రత కావాలని గతంలో ఈ జంట కోర్టును ఆశ్రయించగా మే 1న వారికి భద్రత కల్పిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. పటాన్‌కు చెందిన పిటిషనర్ తన భార్య (24)ను తిరిగి తన వద్దకు పంపేలా ఆదేశించాలని న్యాయస్ధానానికి నివేదించారు. కేసు వివరాల ప్రకారం.. యువతి తల్లితండ్రుల అభిమతానికి వ్యతిరేకంగా ఈ ఏడాది జనవరి 17న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. అప్పటినుంచి యువతి తల్లితండ్రుల నుంచి బెదిరింపులు ఎదురవడంతో ఏప్రిల్ 29న వారు పోలీసు భద్రతను కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వారికి మే 1 నుంచి భద్రత కల్పించాలని తక్షణమే ఆదేశాలు జారీ చేసింది. అయితే మే 10న యువతి తల్లితండ్రులు ఆమెను బలవంతంగా పిటిషనర్ నుంచి వేరుచేసి తీసుకువెళ్లారు. తన భార్యను ఆమె పుట్టింటి వారు బలవంతంగా తీసుకువెళ్లారని ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిర్లక్ష్యం చూపారని ఆరోపణలు వచ్చాయి. మే 27న మరోసారి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశారు. పోలీసులు సవ్యంగా విచారణ చేపట్టకుండా మే 25వ తేదీతో ఉన్న లేఖను తనకు ఇచ్చారని చెప్పారు. లేఖలో తనకు గతంలో పిటిషనర్‌తో ప్రేమ వివాహం జరిగిందని, ఆయనతో విడాకులు తీసుకుని తల్లితండ్రుల సమ్మతితో మరొకరిని వివాహం చేసుకున్నానని స్పష్టం చేసింది. తాను ఎలాంటి ఒత్తడిలో ఈ నిర్ణయం తీసుకోలేదని, తన నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నానని పేర్కొంది. పిటిషనర్ వాదనలు పూర్తి అవాస్తవమని, నిరాధారమని కూడా ఈ లేఖలో యువతి పేర్కొంది. కాగా, పోలీసుల నివేదికను పరిశీలించాలని, యువతి విడాకులు పొంది తిరిగి వివాహం చేసుకుందా అనేది నిర్ధారించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 13కు హైకోర్టు వాయిదా వేసింది. -
అహ్మద్ పటేల్ ఎన్నిక.. ఈసీకి నోటీసులు
అహ్మదాబాద్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఎన్నికల సంఘానికి ఝలకిచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అహ్మద్ పటేల్‌తోపాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది. ఇద్దరు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు భోలాభాయ్ గోయల్, రాఘవజీ పటేల్‌లు ఓటింగ్ తర్వాత తమ బ్యాలెట్ పేపర్లను చూపించటం, కాంగ్రెస్ ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ఆ రెండు ఓట్లు చెల్లవని ప్రకటించటం తెలిసిందే. చివరకు 44 ఓట్లతో అహ్మద్ పటేల్ గెలుపొందారు. అయితే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన అహ్మదాబాద్ హైకోర్టులో బల్వంత్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ‘ఓట్లు చెల్లుతాయని రిటర్నింగ్ ఓసారి చెప్పాక, తర్వాత అవి చెల్లవంటూ చెప్పే అధికారం ఎన్నికల సంఘానికి లేదు’ అని అయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు ఎన్నికల్లో అహ్మద్ అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపించారు కూడా. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వివరణ ఇవ్వాలంటూ ఈసీని కోరింది. అంతేకాదు రాజసభ్య ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మరో బీజేపీ నేతలు అమిత్‌షా, స్మృతీ ఇరానీలకు కూడా నోటీసులు జారీ చేసింది.