ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివాదంపై కేజ్రీవాల్‌కు మరోసారి షాక్ తగిలింది. ఈ వివాదంపై తాజాగా కేజ్రీవాల్ సహా ఆప్ ఎంపీ సంజయ్‌కు అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీటిపై మే 23వ తేదీలోపు సమాధాని ఇవ్వాలన్ని నోటీసుల్లో పేర్కొంది.
వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ డిగ్రీ అర్హతను ప్రశ్నిస్తూ కేజ్రీవాల్, సంజయ్ సింగ్ గుజరాత్ యూనివర్సిటీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అయితే, వారు ఉద్దేశపూర్వకంగా గుజరాత్ యూనివర్సిటీ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారని వర్సిటీ రిజిస్ట్రార్ పీయూష్ పటేల్ క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ అహ్మదాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. వీటిపై మే 23లోగా స్పందించాలని ఆదేశిస్తూ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జయేశ్‌భాయ్ చోవాటియా ఆదేశించారు.
ఇక, అంతకుముందు.. ప్రధాని మోదీ డిగ్రీపై కేజ్రీవాల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్స్ ఉంటే.. వర్సిటీ ఎందుకు బయటపెట్టడం లేదు. ఫేక్ సర్టిఫికెట్ కాబట్టే వర్సిటీ బయటపెట్టడం లేదేమో అని అన్నారు. ప్రధాని తమ విద్యార్థి అని ఢిల్లీ, గుజరాత్ వర్సిటీలు చెప్పుకునేవి కదా! అంటూ కామెంట్స్ చేశారు. ఇక, ఆప్ ఎంపీ సంజయ్.. ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదని వర్సిటీ నిరూపించిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment