ఆప్ నేత సంజయ్ సింగ్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో ఐఏఎస్ అధికారుల సమ్మె, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో సీఎం కేజ్రీవాల్ మంత్రుల ధర్నాలతో రాజధాని అట్టుడుకుతుండగా కేంద్రం మౌనం దాల్చడాన్ని ఆప్ తప్పుపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో మాట్లాడేందుకు సమయం లేదని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆక్షేపించారు. ఎన్నికైన ఓ రాష్ట్ర ముఖ్యమంత్రైన కేజ్రీవాల్‌తో ప్రధాని తక్షణమే సంప్రదింపులు జరపాలని సింగ్ డిమాండ్ చేశారు.
చర్చలకు ఢిల్లీ సీఎం, ఢిల్లీ సర్కార్ సిద్ధంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా లేదని మండిపడ్డారు. ప్రధాని పాకిస్తాన్‌తో మాట్లాడతారు..కానీ తమతో సంప్రదించేందుకు ఆయనకు సమయం లభించదని విమర్శించారు. మరోవైపు ఐఏఎస్ అధికారుల సమ్మెను నివారించాలని కోరుతూ సీఎం అరవింద్ కేజ్రీవాల్, గ్రామీణాభివృద్ధి మంత్రి గోపాల్ రాయ్‌తో కలిసి ఎల్జీ బైజల్ కార్యాలయంలో ధర్నాను కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment