అహ్మద్ పటేల్ ఎన్నిక.. ఈసీకి నోటీసులు
Published Mon, Aug 21 2017 2:56 PM | Last Updated on Wed, Sep 5 2018 3:33 PM
అహ్మదాబాద్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఎన్నికల సంఘానికి ఝలకిచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అహ్మద్ పటేల్‌తోపాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది.
ఇద్దరు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు భోలాభాయ్ గోయల్, రాఘవజీ పటేల్‌లు ఓటింగ్ తర్వాత తమ బ్యాలెట్ పేపర్లను చూపించటం, కాంగ్రెస్ ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ఆ రెండు ఓట్లు చెల్లవని ప్రకటించటం తెలిసిందే. చివరకు 44 ఓట్లతో అహ్మద్ పటేల్ గెలుపొందారు. అయితే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన అహ్మదాబాద్ హైకోర్టులో బల్వంత్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ‘ఓట్లు చెల్లుతాయని రిటర్నింగ్ ఓసారి చెప్పాక, తర్వాత అవి చెల్లవంటూ చెప్పే అధికారం ఎన్నికల సంఘానికి లేదు’ అని అయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు ఎన్నికల్లో అహ్మద్ అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపించారు కూడా.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వివరణ ఇవ్వాలంటూ ఈసీని కోరింది. అంతేకాదు రాజసభ్య ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మరో బీజేపీ నేతలు అమిత్‌షా, స్మృతీ ఇరానీలకు కూడా నోటీసులు జారీ చేసింది.
Advertisement
Advertisement