Ahmad Patel
-
అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమం
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గత నెలలో కరోనా పాజిటివ్‌గా తేటడంతో గుర్‌గ్రామ్‌లోని ప్రముఖ మేదాంత ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఆరోగ్యం విషమంగా మారడంతో ఐసీయూలోకి తరలించారు. అక్టోబర్ 1 నుంచి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. కరోనా కారణంగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తలెత్తిందని చెప్పారు. మరోవైపు అహ్మద్ పటేల్ ఆరోగ్యంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా కోలుకుని అరోగ్యంతో తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నారు. -
కాంగ్రెస్ సీనియర్ నేతకు కరోనా పాజిటివ్!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. దీంతో ఆయన ఢిల్లీలోని తన నివాసంలో ఐసోలేషన్లోకి వెళ్లారు. తనతో కాంటాక్ట్ అయినవాళ్లు కూడా కోవిడ్ -19 టెస్ట్ చేయించుకొని ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఇప్పటికే పలువురు ప్రముఖ నాయకులకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతలైన అభిషేక్ సింఘ్వీ, తరుణ్ గోగొయ్‌లకు కూడా కరోనా సోకింది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అమిత్‌షా, నితిన్ గడ్కరీకి కూడా కరోనా బారినపడ్డారు. చదవండి: వ్యాక్సిన్ కహానీ: అందుబాటులోకి వచ్చేదెలా? -
ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి..?
సాక్షి, అమరావాతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఆదాయపన్ను శాఖ దాడుల్లో చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో కీలక డాక్యుమెంట్లు లభ్యమైన విషయం తెలిసిందే. వీటి ఆధారంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్ పటేల్‌కు రూ.400 కోట్లకుపైగా నల్లధనాన్ని హవాలా మార్గంలో చేరవేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ విషయంపై విజయసాయిరెడ్డి ట్విటర్లో స్పందించారు. 'అహ్మద్ పటేల్ కు పంపిన రూ.400 కోట్లే కాదు. బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటికీ నిధులు సమకూర్చాడు. తెలంగాణ ఎన్నికల్లో రూ.400 కోట్లు ఖర్చుపెట్టాడు. అప్పట్లో దీనిపై జాతీయ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రం సీఎం దేశం మొత్తానికి ఎలక్షన్ ఫండింగ్ చేశాడు' అని చెప్పారు. చదవండి: ఆ కాగితాలు భద్రంగా దాచుకో చిట్టీ: విజయసాయి రెడ్డి 'మద్యం ధరలు పెంచి మందు బాబుల పొట్ట కొడుతున్నారని రంకెలేస్తాడు. పీపీఏలను సమీక్షించి తక్కువ ధరకు కరెంట్ కొనుగోలు చేద్దామని ప్రభుత్వమనుకుంటే అడ్డుపడతాడు. ఇన్ సైడర్ ట్రేడింగు పైనా దర్యాప్తు జరపొద్దట. తన మాజీ పిఎస్ అడ్డంగా దొరికితే కక్ష సాధింపు అంటాడు. ఏమైంది 40 ఇయర్స్ ఇండస్ట్రీకి?' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: ఆస్తుల ప్రకటన రోటీన్ డ్రామా : విజయసాయిరెడ్డి కాగా మరో ట్వీట్లో 'కమీషన్ల కోసం ఎక్కువ ధరకు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకొని ఏపీ ట్రాన్స్ కోకు 70 వేల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళ్లాడు బాబు. ఈ పీపీఏల దళారి ఎవరంటే కిరసనాయిలు. అక్రమ సంపాదన ఆగిపోయిందనే సీఎం జగన్ గారిని పీపీఏల రద్దుపై ప్రధాని మోదీ నిలదీశారని బోగస్ వార్త రాశాడు' అంటూ పచ్చ మీడియా రాతలపై విరుచుకుపడ్డారు. చదవండి: 'టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారట' -
కాసేపు క్లాప్స్ కొట్టవచ్చు కదా..!
సాక్షి ,అమరావతి: టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ప్రజా చైతన్య యాత్ర’కు పార్టీ కార్యకర్తల నుంచి కూడా స్పందన రావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చప్పట్లు కొట్టాలని చంద్రబాబు ప్రాధేయపడుతుంటే జాలేస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు... ‘‘గట్టిగా చప్పట్లు కొట్టి తనను ఉత్సాహపరచాలని 70 ఏళ్ల వయసులో ప్రాధేయపడుతుంటే జాలేస్తుంది. కార్యకర్తలు మరీ స్పందన లేకుండా మారిపోతే ఎలా? అడిగినందుకైనా కాసేపు క్లాప్స్ కొట్టొచ్చుగదా. చివరకు స్లోగన్స్ ఇచ్చి అందరూ తనతోనే ఉన్నారని భ్రమపడి ఇంకో చోటుకి బయలుదేరుతున్నాడు’’ అని తనదైన శైలిలో ట్వీట్ చేశారు.('టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారట') గిలగిలా కొట్టుకుంటున్నారు.. తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఆదాయపన్ను శాఖ దాడుల్లో చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో కీలక డాక్యుమెంట్లు లభ్యమైన విషయం తెలిసిందే. వీటి ఆధారంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆంతరంగికుడు అహ్మద్ పటేల్‌కు రూ.400 కోట్లకుపైగా నల్లధనాన్ని హవాలా మార్గంలో చేరవేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ విషయంపై విజయసాయిరెడ్డి ట్విటర్లో స్పందించారు. ‘‘బాబు వెళ్లి కలిసిన వారంతా నడినెత్తిన శని తాండవం చేసినట్టు గిలగిలా కొట్టుకుంటున్నారు. తీహార్ జైలు కెళ్లిన వారు, ఐటీ, ఈడీ నోటీసులందుకున్న పెద్దలు సారు ‘స్పర్శ’ కరోనా వైరస్ కంటే పవర్ ఫుల్ అని నిర్దారించారు. అహ్మద్ పటేల్ లాంటి ఉద్దండులకూ హవాలా ఉచ్చు బిగిసిందంటే మామూలు విషయమా?’’ అని వ్యంగ్యస్త్రాలు సంధించారు.(అమరావతి నుంచి.. అహ్మద్ పటేల్‌కు!) 108కి దారివ్వని టీడీపీ కార్యకర్తలు -
ఎమ్మెల్యేలంతా మాతోనే ఉన్నారు: కాంగ్రెస్
ముంబై : మహారాష్ట్ర చరిత్రలో ఈరోజు చీకటి రోజు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. తెల్లవారుజామున హడావుడిగా ప్రభుత్వ ఏర్పాటు జరిగిందని.. ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని ధ్వజమెత్తారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఉదయం అనూహ్యం పరిణామాలు చోటుచేసుకున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్(బీజేపీ), ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్(ఎన్సీపీ) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి అహ్మద్ పటేల్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ఇప్పటికీ కలిసే ఉన్నాయని స్పష్టం చేశారు. తామంతా కలిసి బల పరీక్షలో బీజేపీని ఓడిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యేలందరూ తమతోనే ఉన్నారని, ముగ్గురు మాత్రం వారి స్వగ్రామాల్లో ఉన్నందున ప్రస్తుతం తమ వెంట లేరన్నారు. రాజకీయంగా, చట్టపరంగా బీజేపీని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.(చదవండి : మహా ట్విస్ట్: పవార్, ఉద్ధవ్ ఠాక్రే ప్రెస్‌మీట్ ) ఇదిలా ఉండగా మహారాష్ట్ర తాజా పరిణామాలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. ఇక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ పాల్గొనకపోవడంతో కూటమి విచ్ఛిన్నమైందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అహ్మద్ పటేల్ తామంతా కలిసే ఉన్నట్లు ప్రకటించారు. ఇక మీడియా సమావేశంలో భాగంగా అజిత్ పవార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన శరద్ పవార్.. అతడి స్థానంలో కొత్త శాసన సభా పక్ష నేతను ఎన్నుకుంటామని తెలిపారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. -
అహ్మద్ పటేల్ ఎన్నిక.. ఈసీకి నోటీసులు
అహ్మదాబాద్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఎన్నికల సంఘానికి ఝలకిచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అహ్మద్ పటేల్‌తోపాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది. ఇద్దరు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు భోలాభాయ్ గోయల్, రాఘవజీ పటేల్‌లు ఓటింగ్ తర్వాత తమ బ్యాలెట్ పేపర్లను చూపించటం, కాంగ్రెస్ ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ఆ రెండు ఓట్లు చెల్లవని ప్రకటించటం తెలిసిందే. చివరకు 44 ఓట్లతో అహ్మద్ పటేల్ గెలుపొందారు. అయితే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన అహ్మదాబాద్ హైకోర్టులో బల్వంత్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ‘ఓట్లు చెల్లుతాయని రిటర్నింగ్ ఓసారి చెప్పాక, తర్వాత అవి చెల్లవంటూ చెప్పే అధికారం ఎన్నికల సంఘానికి లేదు’ అని అయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు ఎన్నికల్లో అహ్మద్ అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపించారు కూడా. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వివరణ ఇవ్వాలంటూ ఈసీని కోరింది. అంతేకాదు రాజసభ్య ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మరో బీజేపీ నేతలు అమిత్‌షా, స్మృతీ ఇరానీలకు కూడా నోటీసులు జారీ చేసింది. -
అహ్మద్ పటేల్ ఎన్నిక చెల్లదు!
అహ్మదాబాద్: నాటకీయ పరిణామాల నడుమ గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థిగా పోటీ చేసిన బీజేపీ నేత బల్వంత్ సింగ్ రాజ్‌పుత్ అహ్మదాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరు రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనకు(బల్వంత్) వేసిన ఓట్లు చెల్లుతాయని, పైగా ఎన్నికల ముందు 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూర్ తరలించి ఎన్నికల్లో ‘అవినీతి ప్రవర్తన’ కు అహ్మద్ పటేల్ పాల్పడ్డారని పిటిషన్ లో బల్వంత్ పేర్కొన్నారు. సోమవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. ఆరుగురు కాంగ్రెస్ నేతలు సరిగ్గా రాజ్యసభ ఎన్నికలకు ముందే పార్టీకి గుడ్ బై చెప్పగా, బల్వంత్ తోపాటు మరో ముగ్గురు బీజేపీలోకి చేరిపోయారు. ఆపై కాంగ్రెస్ పార్టీ తరపున అహ్మద్ పటేల్, బీజేపీ తరపున బల్వంత్ బరిలోకి దిగారు . ఇద్దరు రెబల్ బ్యాలెట్ ఎమ్మెల్యేలు బల్వంత్ కు ఓటు వేసిన అనంతరం బ్యాలెట్ పేపర్లను బహిరంగంగా చూపించారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, అవి చెల్లవని ఈసీ స్పష్టం చేసింది. చివరకు అహ్మద్ పటేల్ 44, బల్వంత్ రాజ్ పుత్ కు 38 ఓట్లు పోలు కావటంతో కాంగ్రెస్ సీనియర్ నేతనే విజయం వరించింది.