
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. దీంతో ఆయన ఢిల్లీలోని తన నివాసంలో ఐసోలేషన్‌లోకి వెళ్లారు. తనతో కాంటాక్ట్ అయినవాళ్లు కూడా కోవిడ్ -19 టెస్ట్ చేయించుకొని ఐసోలేషన్‌లో ఉండాలని ఆయన ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఇప్పటికే పలువురు ప్రముఖ నాయకులకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేతలైన అభిషేక్ సింఘ్వీ, తరుణ్ గోగొయ్‌లకు కూడా కరోనా సోకింది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అమిత్‌షా, నితిన్ గడ్కరీకి కూడా కరోనా బారినపడ్డారు. చదవండి: వ్యాక్సిన్ కహానీ: అందుబాటులోకి వచ్చేదెలా?
Comments
Please login to add a commentAdd a comment