Gujarat Rajya Sabha Election
-
అహ్మద్ పటేల్ ఎన్నిక.. ఈసీకి నోటీసులు
అహ్మదాబాద్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఎన్నికల సంఘానికి ఝలకిచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అహ్మద్ పటేల్‌తోపాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది. ఇద్దరు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు భోలాభాయ్ గోయల్, రాఘవజీ పటేల్‌లు ఓటింగ్ తర్వాత తమ బ్యాలెట్ పేపర్లను చూపించటం, కాంగ్రెస్ ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ఆ రెండు ఓట్లు చెల్లవని ప్రకటించటం తెలిసిందే. చివరకు 44 ఓట్లతో అహ్మద్ పటేల్ గెలుపొందారు. అయితే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన అహ్మదాబాద్ హైకోర్టులో బల్వంత్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ‘ఓట్లు చెల్లుతాయని రిటర్నింగ్ ఓసారి చెప్పాక, తర్వాత అవి చెల్లవంటూ చెప్పే అధికారం ఎన్నికల సంఘానికి లేదు’ అని అయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు ఎన్నికల్లో అహ్మద్ అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపించారు కూడా. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వివరణ ఇవ్వాలంటూ ఈసీని కోరింది. అంతేకాదు రాజసభ్య ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మరో బీజేపీ నేతలు అమిత్‌షా, స్మృతీ ఇరానీలకు కూడా నోటీసులు జారీ చేసింది. -
ఇకనైనా కాంగ్రెస్ రాత మారేనా?
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ నుంచి రాజ్యసభకు ఉత్కంఠభరితంగా జరిగిన ఎన్నికల్లో సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ వర్గాలు పండుగ చేసుకుంటున్నాయి. 16 ఏళ్లపాటు తెరవెనక నుంచి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను నడిపించిన అహ్మద్ పటేల్ విజయం పార్టీ కార్యకలాపాల్లో ఓ మలుపు కాబోతున్నదని ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. వరుస పరాజయాలతో కునారిల్లిపోతున్న కాంగ్రెస్ పార్టీకి మళ్లీ జవసత్వాలు తెచ్చేందుకు పటేల్ విజయం ఎంతో దోహదపడుతుందని వారంటున్నారు. ఆయన మళ్లీ పార్టీపై మునుపటి పట్టును సాధించగలరని వారు ఆశిస్తున్నారు. సోనియా గాంధీ కుమారుడిగా, రాజకీయ వారసుడిగా పార్టీ వ్యవహారాల్లో ప్రత్యక్ష పాత్ర వహిస్తున్న రాహుల్ గాంధీకి అహ్మద్ పటేల్ ఎప్పటికీ సమానుడు కాలేరు. రాహుల్ గాంధీ పార్టీలో క్రియాశీలక పాత్ర నిర్వహిస్తున్న నాటి నుంచి అహ్మద్ పటేల్ పార్టీ వ్యవహారాలకు కాస్త దూరం జరిగిన మాట కూడా వాస్తవమే. కాంగ్రెస్‌లో పార్టీ పునర్ వ్యవస్థీకరణ అంత సులభం కాదు. ఈ విషయంలో రాహుల్ గాంధీ తీసుకుంటున్న చొరవకు పలు చోట్ల పార్టీ పెద్దలు అడ్డు తగులుతూ వచ్చారు. అందుకని ఇంతవరకు సోనియా గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను పూర్తిగా రాహుల్ గాంధీకి అప్పగించలేక పోయారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ తన విధేయుడైన మాజీ రాజ్యసభ సభ్యుడు అవినాశ్ పాండేకు పార్టీలో పదోన్నతి కల్పించి ప్రధాన కార్యదర్శి హోదాలో రాజస్థాన్ పార్టీ వ్యవహారాలను అప్పగించడంలో విజయం సాధించారు. అలాగే పిఎల్ పునియా, ఆర్పీఎన్ సింగ్, ఆశా కుమారి, ఏ చల్లా కుమార్‌లకు రాష్ట్ర పార్టీల బాధ్యతలను అప్పగించడంలోనూ రాహుల్ గాంధీ తన పంథా నెగ్గించుకున్నారు. అలాగే పార్టీ సీనియర్ నేతలైన కమల్ నాథ్, గులామ్ నబీ ఆజాద్, అంబికా సోని లాంటి వారిని పార్టీ ప్రధాన కార్యదర్శులుగా మళ్లీ తీసుకున్నారు. అలాగే అహ్మద్ పటేల్ విధేయులైన మాజీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండేలకు కూడా ప్రధాన కార్యదర్శులుగా తిరిగి తీసుకోవడమే కాకుండా ఎన్నికలు జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ పార్టీ వ్యవహారాలను అప్పగించారు. దిగ్విజయ్ సింగ్ లాంటి సీనియర్ నేతల బాధ్యతలను కుదించారు. గోవాలో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైన నేపథ్యంలో దిగ్విజయ్‌ను గోవా, కర్ణాటక, తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన ప్రస్తుతం ఏపీ ఇంచార్జిగా మాత్రమే కొనసాగుతున్నారు. పార్టీ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నికవడం పార్టీ విజయంగా కంటే వ్యక్తిగతంగా ఇది పటేల్‌కు విజయమని చెప్పవచ్చు. ఇక ఆయన తన విజయాన్ని పార్టీ విజయంగా మల్చాల్సిన అవసరం ఉంది. రానున్న గుజరాత్ ఎన్నికల్లో అహ్మద్ నిర్వహించే పాత్రపై ఇటు ఆయన వ్యక్తిగత ప్రతిష్ట, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. -
అమిత్ షాకు పటేల్‌పై అంత కక్ష ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆ అంశానికి మాత్రమే మీడియా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉండగా, అలా ఎందుకు జరగలేదు? గుజరాత్ నుంచి రాజ్యసభకు మంగళవారం ఎన్నికలు అత్యంత సాదాసీదా జరగాల్సి ఉండగా, ఆద్యంతం ఎందుకు ఉత్కంఠభరితంగా సాగాయి ? అమిత్ షా విజయాన్ని కీర్తించాల్సిన పత్రికల పతాక శీర్షికలు అహ్మద్ పటేల్ ఐదవసారి విజయానికి ఎందుకు పట్టంగట్టాయి? అందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విధేయుడు, పార్టీ వ్యూహకర్త అమిత్ షా వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌గా పోటీ జరగడమే కారణమా? రాజకీయ చాణక్యంలో ఎవరిది పైచేయో తేల్చేసే ఎన్నికలు అవడం వల్లనా! వీరిద్దరి మధ్య రాజకీయ పోటీ వ్యక్తిగత పోటీగా మారడానికి కారణాలేమైనా ఉన్నాయా? ఇంతకు విజయం ఎవరిది? గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికలు ప్రాధాన్యత ఏర్పడింది. అసెంబ్లీలోని బలబలాల ప్రకారం అధికార బీజేపీకి రెండు సీట్లు, కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు సులభంగా గెలుచుకునే అవకాశం ఉంది. రెండు సీట్లకు బీజేపీ అమిత్‌షా, స్మతి ఇరానీ పేర్లను ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ, 2001 నుంచి సోనియా గాంధీకి రాజకీయ కార్యదర్శిగా ఉంటూ చక్రం తిప్పుతున్న అహ్మద్ పటేల్‌ను బరిలోకి దించింది. ఈ ఎన్నికలు సాదాసీదాగా జరగుతాయని, ఇటు అమిత్ షా, అటు అహ్మద్ పటేల్‌లు విజయం సాధిస్తారని రాజకీయ, మీడియా వర్గాలు భావించాయి సరిగ్గా ఈ సమయంలోనే కాంగ్రెస్ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శంకర్‌సింహ్ వఘేలా పార్టీకి గుడ్‌బై చెప్పడం, ఆ తర్వాత ఆయన ఆరుగురు విదేయులు పార్టీకి రాజీనామా చేయడంతో అమిత్ షా బుర్రలో కొత్త ఆలోచన పుట్టింది. పార్టీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ అసమ్మతి నాయకుడు బల్వంత్ సింగ్ రాజ్‌పుత్‌ను అమిత్ షా రాజ్యసభకు నిలబెట్టారు. దీంతో కంగారు పడిన కాంగ్రెస్ పార్టీ తన గుజరాత్ ఎమ్మెల్యేలను కర్ణాకకలోని ఓ రిసార్ట్‌కు తరలించింది. అయినప్పటికీ 15 కోట్ల రూపాయల చొప్పున తమ పార్టీ ఎమ్మెల్యేలకు కొనేందుకు అమిత్ షా ప్రయత్నించారని శక్తిసింహ్ గోయిల్ లాంటి కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆశ్రయం ఇచ్చిన బెంగళూరు రిసార్ట్ యజమాని, కాంగ్రెస్ మంత్రి ఇంటిపై, రిసార్ట్‌పై సీబీఐ దాడులు జరిగాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే సీబీఐ దాడులు చేయించిందనే ఆరోపణలు బలంగా వచ్చాయి. గుజరాత్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో ఇన్ని మలుపులు ఉన్నాయి కనుక సాదాసీదాగా జరగాల్సిన ఎన్నికలు ఆద్యంతం రసవత్తరంగా కొనసాగాయి. అహ్మద్ పటేల్‌ను లక్ష్యంగా చేసుకొని అమిత్ షా ఎందుకు ఇంత తెగింపుకు దిగారన్న ప్రశ్నకు ఇంకా సమాధానం మిగిలే ఉంది. 2010లో జరిగిన షొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో తనను జైలుకు పంపించారన్న కక్షతోనే అమిత్ షా, పటేల్‌ను లక్ష్యంగా చేసుకున్నారని తెలుస్తోంది. పటేల్ పన్నిన చక్రవ్యూహంలో భాగంగానే నాడు సీబీఐ తనను కేసులో అరెస్ట్ చేసిందన్నది అమిత్ షా నమ్మకం. అమిత్ షా వ్యక్తిగతంగా తనపై కక్ష పెంచుకున్నారని అహ్మద్ పటేల్ గత నెలలో బహిరంగంగా వ్యాఖ్యానించడం, అహ్మద్ పటేల్‌పై కక్షకు షోహ్రాబుద్దీన్ కేసులో అమిత్ షాను జైలుకు పంపించడమే కారణమని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ గమనార్హం. వరుసగా రాజ్యసభకు నాలుగుసార్లు విజయం సాధించిన అహ్మద్ పటేల్‌ను ఓడించినట్లయితే ఇటు తన వ్యక్తిగత కక్ష తీరినట్లు ఉంటుందని, ఇప్పటికే వరుస ఎన్నికల పరాజయంతో తీవ్రంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి నైతిక స్థయిర్యం కూడా లేకుండా పోతుందని అమిత్ షా భావించినట్లు అర్థం అవుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విజయంతో దక్కిన కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి వచ్చి చేరుతుందని ఆయన భావించినట్లున్నారు. ఇంతకు ఈ పోరాటంలో విజేతలెవరు? పార్టీ ఎమ్మెల్యేలను తనవెంట ఐక్యంగా ఉంచేందుకు అహ్మద్ పటేల్ అలియాస్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విశ్వ ప్రయత్నాలు చేసినా చివరకు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజ్‌పుత్‌కు ఓటేసినట్లు వీడియో సాక్షిగా చూపించారు. అందుకు వారి ఓట్లను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. వాటిని ఓట్లుగా పరిగణించాల్సిందేనంటూ బీజేపీ పార్టీ ఏకంగా ఐదుగురు కేంద్ర మంత్రులను ఎన్నికల కమిషన్ వద్దకు రాయబారం పంపింది. తీవ్ర ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణం మధ్య చర్చోప చర్చలు జరిపిన ఎన్నికల కమిషన్ చివరకు ఎన్నికల నిబంధనలకు శిరసావహిస్తూ ఇద్దరు రెబెల్ కాంగ్రెస్ శాసన సభ్యుల ఓట్లు చెల్లదని ప్రకటించడంతో అహ్మద్ పటేల్‌కు అంతిమ విజయం లభించింది. ఇంతకు విజేతలెవరో విజ్ఞులకు తేల్చి చెప్పాల్సిన అవసరం లేదు. -
అదృష్టం కలిసొచ్చి..
అర్ధరాత్రి అటు గుజరాత్‌లోనూ, ఇటు దేశ రాజధాని ఢిల్లీలోనూ హైడ్రామా.. ఎత్తులకు పైఎత్తులతో సాగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్గజం అహ్మద్ పటేల్ గెలుస్తారా? లేదా? అన్న ఉత్కంఠ. చివరికి ఇద్దరు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల ఓట్లు చెల్లవని ఈసీ ప్రకటించడంతో 44 ఓట్లతో గట్టెక్కి ఊపిరి పీల్చుకున్నారు! దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఈ ఎన్నికల్లో పటేల్ తన బలంతో గెలిచారని అనేకంటే బీజేపీ మూడో అభ్యర్థికి ఓటేసిన కాంగ్రెస్ రెబల్స్ పొరపాటు వల్లే గట్టెక్కారని అనడం సబబుగా ఉంటుందేమో. తమ బ్యాలట్ పత్రాలను బహిరంగంగా ప్రదర్శించడం వారి పొరపాటు. ఈ ఎన్నికల్లో పటేల్ వేసుకున్న అంచనాలు తారుమారయ్యాయి. తమ క్యాంపులోని 44 మందికి తోడు ఇద్దరు ఎన్సీపీ, ఒక జేడీయూ ఎమ్మెల్యే మద్దతుతో తమ బలం 47కు చేరుతుందన్నది ఆయన అంచనా. కానీ చివరికి దక్కింది 44 ఓట్లే. రెబల్స్ ఎమ్మెల్యేల ఓట్లూ చెల్లి ఉంటే కోటా ఓటు(తొలి ప్రాధాన్య ఓట్లతో గెలవడానికి కావలసిన ఓట్ల సంఖ్య) 45గా ఉండేది. అదే జరిగి ఉంటే పటేల్‌కు 44 ఓట్లే వచ్చాయి కాబట్టి రెండో ప్రాధాన్య ఓట్ల ఆధారంగా విజేతను తేల్చే పరిస్థితి వచ్చేది. పటేల్ విజయావకాశాలూ తగ్గేవి. సత్తా చూపలేకపోతున్న కాంగ్రెస్.. ఈ ఏడాది డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.19 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజలల్లో సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. పైగా రాష్ట్రంలో బీజేపీకి పటిష్ట నాయకత్వమూ లేదు. మోదీ హవా, అమిత్ షా వ్యూహరచనపైనే పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి. రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పటీదార్లు బీజేపీపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి స్థితిలో విపక్ష కాంగ్రెస్ సమరోత్సాహంతో ఉండాలి. మిగతా పార్టీల నేతలనూ తనవైపు ఆకర్షించగలగాలి. రాజ్యసభకు పటేల్ ఎన్నిక నల్లేరు మీద నడక కావాలి. కానీ వాస్తవం మరోలా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం లేక ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను రాజ్యసభ ఎన్నికల్లో ఓడించి అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ పార్టీ శ్రేణులను నీరుగార్చాలని బీజేపీ వ్యూహం పన్నింది. జాతీయస్థాయి కీలకనేత ఓడిపోతే కాంగ్రె స్ డీలాపడుతుందని భావించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌లోని అసంతృప్త ఎమ్మెల్యేలను తనవైపు ఆకర్షించింది. వ్యూహం ఫలించడంతో ఇటీవలే కాంగ్రెస్‌ను వీడిన మాజీ సీఎం శంకర్‌సిన్హ్ వాఘేలా సహా మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మూడో అభ్యర్థి బల్వంత్íసిన్హ్ రాజ్‌పుత్‌కు ఓటేశారు. ఈ ఎన్నికలకు ముందే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ ఆలస్యంగా మేలుకుని గత నెలాఖర్లో మిగిలిన 44 మంది ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్‌కు తరలించింది. సోమవారం తిరిగి గుజరాత్‌కు తీసుకొచ్చి, ఓటేసేదాకా శిబిరంలోనే ఉంచింది. అయినప్పటికీ వీరిలో ఒకరు(కరమ్సింహ్ మక్వానా) బీజేపీకి ఓటేశారు! ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలే చెప్పారు. పటేల్‌తో సహా కాంగ్రెస్ నేతలెవరూ దీన్ని పసిగట్టలేకపోయారు. పటేల్‌కు 43 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓట్లు, మరొకటి ఇతర పార్టీ నుంచి పడింది. ఎన్సీపీ ఎమ్మెల్యే ఒకరు, జేడీయూ ఎమ్మెల్యే ఒకరు తాము పటేల్‌కు ఓటేశామని బాహాటంగా చెప్పారు. కానీ ఈ ఇద్దరిలో ఒకరు పటేల్‌కు వేయలేదని పటేల్ దక్కిన 44 ఓట్లు తేటతెల్లం చేస్తున్నాయి. వీరిద్దరూ పటేల్‌కు ఓసేసి ఉంటే 45 ఓట్లు దక్కేవి. ఈ ఇద్దరిలో ఎవరు పటేల్‌కు ఓటేశారన్నది మిస్టరీగా మారింది. ఈ మొత్తం తతంగంలో కాం గ్రెస్ మంగళవారం సాయంత్రం చూపిన కార్యదక్షత ఆ పార్టీ పరువు కాపాడింది. రెబల్ ఓట్లు చెల్లవంటూ చిదంబరం సహా పలువురు నేతలు ఈసీని కలసి గట్టి వాదనలు వినిపిం చారు. ఏదేమైనా పటేల్‌ది ‘సాంకేతిక’ విజయం మాత్రమేనని, సంబరాలు జరుపుకోవాల్సినంత ఘన విజయం కాదని నిపుణులు అంటున్నారు. -
14మంది ఎమ్మెల్యేలపై వేటు
గాంధీనగర్: విప్‌ను దిక్కరించిన ఎమ్మెల్యేలపై గుజరాత్ కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. ఏకంగా 14మంది పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెన్సన్ చేసింది. వీరిలో ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన శంకర్ సింగ్ వాఘెలా కూటమికి చెందిన మహేంద్ర వాఘెలా, రాఘవ్జీ పటేల్, అమిత్ చౌదరీ, బోలాబాయ్ గోహిల్, సీకే రౌల్జీ, కామ్సీ మక్వానా, హకుబా జడేజా ఉన్నారు. మంగళవారం గుజరాత్లో రాజ్యసభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పార్టీ అభ్యర్థి అహ్మద్ పటేల్‌కు ఓటువేయాలని విప్ జారీ చేసింది. అయితే, కానీ మొత్తం 14మంది ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయాన్ని దిక్కరించి బీజేపీకి ఓటు వేయడంతో వారిపై తాజాగా సస్పెన్షన్ వేటు వేసినట్లు గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అశోక్ గెహ్లాట్ తెలిపారు. -
'ఆ మూడింటితో గెలవలేరు'
న్యూఢిల్లీ: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో చివరికి ప్రజాస్వామ్యం గెలిచిందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. గుజరాత్లో అత్యంత ఉఠ్కంతభరితంగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ గెలిచారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులకు పటేల్ గెలుపు కనువిప్పు కావాలని కాంగ్రెస్ పేర్కొంది. 'డబ్బు, కండబలం, కుతంత్రంతో విజయం సాధించలేరు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బలహీన ఎమ్మెల్యేలను బీజేపీ చీల్చింది. కానీ పార్టీని చీల్చలేకపోయింద'ని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ట్వీట్ చేశారు. ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరును ఆయన ప్రశంసించారు. యుద్ధంలో గెలవడం కష్టమేనని, విజయం సాధించేందుకు ప్రభుత్వం చాలా కష్టపడిందని చివరకు ప్రజాస్వామ్యం గెలిచిందని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. అహ్మద్ పటేల్‌కు ఆమె అభినందనలు తెలిపారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో సత్యం గెలిచిందని, అహం ఓడిపోయిందని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జివాల్ అన్నారు. అహ్మద్ పటేల్ విజయంతో బీజేపీ చెప్పిందంతా బూటకమని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. -
పటేల్‌కు ఓటు వేయలేదు: వాఘేలా
అహ్మదాబాద్: గత నెలలో కాంగ్రెస్‌ను వీడిన శంకర్‌సిన్హ్ వాఘేలా యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అహ్మద్ పటేల్‌కు ఓటు వేయలేదని తెగేసి చెప్పారు. ఓడిపోయే అభ్యర్థికి ఓటు ఎవరు వేస్తారని ఆయన ప్రశ్నించడంతో కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. కాంగ్రెస్ నుంచి అయిదో సారి రాజ్యసభలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరిన అహ్మద్ పటేల్ విజయం సాధించడం అనుమానమేనని వాఘేలా అన్నారు. మంగళవారం రాజ్యసభ ఎన్నికల పోలింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం ఆయనకు ఓటు వేయరని, అహ్మద్ పటేల్‌కు 40 మించి ఓట్లు రావని జోస్యం చెప్పారు. గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ 57 మంది ఎమ్మెల్యేలుండగా, ఇటీవలే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ బలం 51కి పడిపోయింది. వాఘేలా వర్గానికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు. ఇక 44 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ఉండగా, అహ్మద్ పటేల్ విజయం సాధించాలంటే మరో ఎమ్మెల్యే మద్దతు ఆ పార్టీకి అవసరం. అయితే ఇద్దరు సభ్యులున్న ఎన్సీపీ మద్దతుపై పటేల్ ఆశలు పెట్టుకున్నారు. -
నెంబర్ గేమ్‌లో పటేల్ నెగ్గేనా..?
ఢిల్లీ: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల పోలింగ్ మరికొన్ని గంటల్లో జరగనున్న క్రమంలో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ విజయంపై ఉత్కంఠ నెలకొంది. గుజరాత్ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఎన్నికవనుండగా తగినంత సంఖ్యాబలం ఉండటంతో బీజేపీ నుంచి అమిత్ షా, స్మతీ ఇరానీ సులభంగా విజయం సాధించనున్నారు. మూడో అభ్యర్థిగా అహ్మద్ పటేల్ ఎన్నికపై కాంగ్రెస్‌లో కలవరం వ్యక్తమవుతున్నది. ఇద్దరు సభ్యులున్న ఎన్సీపీ మద్దతుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్‌కు ఆ పార్టీ నేత ప్రపుల్ పటేల్ ఎవరికి మద్దతు ఇవ్వాలనేదానిపై తామింకా నిర్ణయం తీసుకోలేదని ప్రకటించడంతో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలినట్లైంది. సీనియర్ నేత వాఘేలా మద్దతుదారులు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ శిబిరంలో ప్రస్తుతం 44 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. అహ్మద్ పటేల్ గెలవాలంటే ఆ పార్టీకి 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు కొందరు ప్రత్యర్థికి ఓటు వేస్తారనే వార్తలూ కాంగ్రెస్ క్యాంప్‌లో కలకలం రేపుతున్నాయి. అహ్మద్ పటేల్ నెగ్గాలంటే ఎన్సీపీ మద్దతు అనివార్యం. మరి రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన పటేల్ గెలుపు కోసం ఎలాంటి కసరత్తు చేస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరోవైపు గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలపై తనకు పూర్తి నమ్మకం ఉందని... క్రాస్ ఓటింగ్‌కు ఆస్కారమే లేదని చెప్పారు. కాంగ్రెస్‌కు మెజార్టీ ఉందని తెలిసి మూడో అభ్యర్థిని బరిలో దించడం బీజేపీ దుర్నీతికి నిదర్శనమని అహ్మద్ పటేల్ విమర్శించారు. -
గుజరాత్లో వేడెక్కిన రాజకీయం
-
గుజరాత్లో వేడెక్కిన రాజకీయం
అహ్మదాబాద్: గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదిరోజుల తర్వాత సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. కర్ణాటకలోని ఒక ప్రైవేటు రిసార్ట్‌లో బస చేసిన వీరిని సోమవారం ఉదయం గుజరాత్‌కు తీసుకొచ్చారు. వీరిని ఆనంద్ జిల్లాలోని నిజానంద్ రిసార్ట్‌కు తరలించారు. రేపు జరగనున్న రాజ్యసభ ఎన్నిక నేపథ్యంలో 44 మంది ఎమ్మెల్యేల్ని గత నెల 29న బెంగళూరుకు తరలించిన సంగతి తెలిసిందే. కాగా, తామంతా కలిసికట్టుగా ఉన్నామని.. తమను బీజేపీ భయపెట్టలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే శక్తి సిన్హ్ గోహిల్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల బేరసారాలకు అవకాశమే లేదని అన్నారు. ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారని, తాను విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎన్నిక బరిలో ఉన్న అహ్మద్ పటేల్ వ్యాఖ్యానించారు. కాగా, 44 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమవుతారని అంతకుముందు వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యేలు నేరుగా గుజరాత్ చేరుకోవడం ఊహాగానాలకు తెరపడింది. రేపు జరగనున్న రాజ్యసభ ఎన్నిక పోలింగ్‌లో తమ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకుండా చూసేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాజ్యసభ ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో గుజరాత్లో రాజకీయం మరోసారి వేడెక్కింది. -
నేరుగా గుజరాత్‌కే..
ఎమ్మెల్యేలు సోనియాను కలుస్తారన్నది అవాస్తవం: కాంగ్రెస్ బెంగళూరు: కర్ణాటకలోని ఒక ప్రైవేటు రిసార్ట్‌లో బస చేస్తున్న గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. నేరుగా తమ స్వరాష్ట్రానికి చేరుకుంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వీరంతా ఢిల్లీ వెళ్లి పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమవుతారని వస్తున్న కథనాలు అవాస్తవమని పేర్కొన్నాయి. ఈ నెల 8న జరగనున్న రాజ్యసభ ఎన్నిక నేపథ్యంలో 44 మంది ఎమ్మెల్యేల్ని గత నెల 29న బెంగళూరుకు తరలించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు నేరుగా గుజరాత్ చేరుకుంటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి శక్తి సిన్హ్ గోహిల్ వెల్లడించారు. రాజ్యసభ ఎన్నికలో అహ్మద్ పటేల్ కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. పార్టీ నేతలతో అమిత్‌షా సమావేశం అహ్మదాబాద్: రాజ్యసభ ఎన్నిక నేపథ్యంలో గుజరాత్‌లోని పార్టీ నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆదివారం సమావేశమయ్యారు. గుజరాత్ సీఎం విజయ్‌రూపానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జితుభాయ్ వాఘానీ, రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ భూపేంద్రయాదవ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శనివారం రాత్రి అహ్మదాబాద్ చేరుకున్న అమిత్‌షా రాజ్య సభ ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఇక్కడే బస చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజ్యసభ ఎన్నికకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అందులో అమిత్‌షా కూడా ఉన్న సంగతి తెలిసిందే. రక్షా బంధన్‌లో పాల్గొనేందుకు షా అహ్మదాబాద్ వచ్చారని, ఎటువంటి అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనరని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. -
ఐటీ దాడులపై స్పందించిన సిద్ధరామయ్య
బెంగళూరు : ఐటీ దాడులపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. తమ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆయన ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. కనీసం స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదని, తమను బదనాం చేసేందుకే దాడులు చేశారని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. కాగా కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి శివకుమార్, ఎంపీ డీకే సురేశ్ నివాసాలపై ఐటీ శాఖ అధికారులు బుధవారం ఉదయం దాడులు చేసిన విషయం తెలిసిందే. అలాగే శివకుమార్, సురేశ్ సోదరులు, బంధువుల ఇళ్లతో పాటు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బసచేసిన ఈగల్ టన్ రిసార్ట్‌లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 39 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు చేపట్టారు. కాగా ఐటీ సోదాల్లో సుమారు 7.5 కోట్ల నగదు పట్టుబడినట్లు సమాచారం. ఐటీ దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ...కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఫోన్ చేసి, తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఇదే అంశంపై రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందంటూ ధ్వజమెత్తారు. అయితే కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. -
మంత్రి శివకుమార్ ఇంటిపై ఐటీ దాడులు
బెంగళూరు : కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే శివకుమార్, ఎంపీ డీకే సురేష్ నివాసాలపై ఐటీ శాఖ దాడి చేసింది. ఐటీ అధికారులు బుధవారం ఉదయం మంత్రి శివకుమార్, ఎంపీ నివాసాలతో పాటు, ఈగల్టన్ గోల్ఫ్ రిసార్టులోనూ సోదాలు చేపట్టింది. కాగా గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈగల్టన్ రిసార్ట్‌లోనే బస చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి పోటీచేస్తున్న తమ అభ్యర్థి అహ్మద్ పటేల్‌ను ఓడించేందుకు బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశచూపుతోందంటూ 44 మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరు శివార్లలోని ఈగల్టన్ రిసార్ట్‌కు తరలించారు. ఈ ఎమ్మెల్యేల వసతి బాధ్యతలను మంత్రి డీకే శివకుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసంతో పాటు, రిసార్టులో ఐటీ శాఖ దాడులు చేయడం గమనార్హం. సోదాలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గుజరాత్ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ
గాంధీనగర్: గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన శంకర్ సింగ్ వాఘెలా కాంగ్రెస్ గుడ్‌బై చెప్పిన వారం తిరగకుండానే మరో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీని వదిలేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఇప్పుడు బీజేపీలో చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ బల్వంత్‌సింగ్ రాజ్పుట్, ఎమ్మెల్యే తేజహ్రి పటేల్ తమ రాజీనామాలు అసెంబ్లీ స్పీకర్ రమణ్‌లాల్ వోరాకు పంపించారు. అలాగే, విజాపూర్ పీఐ పటేల్ తన రాజీనామాను స్పీకర్‌కు పంపించినట్లు వెల్లడించారు. రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనూహ్యంగా వీరు తమ పదవులకు రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు మరో గట్టి షాక్ తిన్నట్లయింది. రాజ్పుట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాత్రమే కాకుండా శంకర్‌సిన్హ వాఘెలాకు బంధువు కూడా. ఇక్కడ ఉన్న మూడు రాజ్యసభ స్థానాల్లో అమిత్ షాను, కేంద్రమంత్రి స్మృతి ఇరానీని బరిలోకి దింపగా కాంగ్రెస్ పార్టీ అహ్మద్‌పటేల్‌ను దింపింది. అయితే, అహ్మద్పటేల్పై బీజేపీ రాజ్‌పుట్‌ను నాలుగో అభ్యర్థిగా నిలబెట్టింది. -
పనికి ప్రతిఫలం రూ. 600 కోట్లు
చిత్రంలోని ముసలాయన పేరు వినూభాయ్. మొన్నటివరకూ వినూభాయ్ ఓ పనిమనిషి. మరి నేడు రూ.600 కోట్లకు అధిపతి! అదెలా అంటే.. 40 ఏళ్లుగా వినూభాయ్ తనకు చేసిన సేవకు మెచ్చి.. అతడి యజమాని బహుమతి కింద తన యావదాస్తి ఇచ్చేశాడు!! నిజమే.. గజరాజ్ సింగ్ జడేజా. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో బడా వ్యాపారవేత్త, కాంగ్రెస్ నేత(ఫొటోలోని వ్యక్తి). గతేడాది సెప్టెంబర్ 21న మరణించారు. మూడు నెలల తర్వాత ఆయన వీలునామా కుటుంబ సభ్యుల చేతికి వచ్చింది. చదివితే షాక్.. ఆస్తి అంతా వినూభాయ్‌కు రాసేశారు. వారికి మండింది. వినూభాయ్‌ను కిడ్నాప్ చేశారు. పోలీసులు సరైన సమయంలో స్పందించి, వినూభాయ్‌ను విడిపించారు. కట్ చేస్తే.. వినూభాయ్ తాను పని చేసిన ఇంట్లోనే.. రాజాలా.. కాలుమీద కాలు వేసుకుని.. దర్జాగా..