
గుజరాత్ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ
గాంధీనగర్: గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన శంకర్ సింగ్ వాఘెలా కాంగ్రెస్ గుడ్‌బై చెప్పిన వారం తిరగకుండానే మరో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీని వదిలేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఇప్పుడు బీజేపీలో చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ బల్వంత్‌సింగ్ రాజ్‌పుట్, ఎమ్మెల్యే తేజహ్రి పటేల్ తమ రాజీనామాలు అసెంబ్లీ స్పీకర్ రమణ్‌లాల్ వోరాకు పంపించారు.
అలాగే, విజాపూర్ పీఐ పటేల్ తన రాజీనామాను స్పీకర్‌కు పంపించినట్లు వెల్లడించారు. రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనూహ్యంగా వీరు తమ పదవులకు రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు మరో గట్టి షాక్ తిన్నట్లయింది. రాజ్‌పుట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాత్రమే కాకుండా శంకర్‌సిన్హ వాఘెలాకు బంధువు కూడా. ఇక్కడ ఉన్న మూడు రాజ్యసభ స్థానాల్లో అమిత్ షాను, కేంద్రమంత్రి స్మృతి ఇరానీని బరిలోకి దింపగా కాంగ్రెస్ పార్టీ అహ్మద్‌పటేల్‌ను దింపింది. అయితే, అహ్మద్‌పటేల్‌పై బీజేపీ రాజ్‌పుట్‌ను నాలుగో అభ్యర్థిగా నిలబెట్టింది.