14మంది ఎమ్మెల్యేలపై వేటు | Congress expels 14 Gujarat MLAs who voted against Ahmed Patel | Sakshi
Sakshi News home page

14మంది ఎమ్మెల్యేలపై వేటు

Published Wed, Aug 9 2017 8:21 PM | Last Updated on Tue, Aug 21 2018 2:48 PM

14మంది ఎమ్మెల్యేలపై వేటు - Sakshi

14మంది ఎమ్మెల్యేలపై వేటు

గాంధీనగర్‌: విప్‌ను దిక్కరించిన ఎమ్మెల్యేలపై గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీ వేటు వేసింది. ఏకంగా 14మంది పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెన్సన్‌ చేసింది. వీరిలో ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన శంకర్‌ సింగ్‌ వాఘెలా కూటమికి చెందిన మహేంద్ర వాఘెలా, రాఘవ్‌జీ పటేల్‌, అమిత్‌ చౌదరీ, బోలాబాయ్‌ గోహిల్‌, సీకే రౌల్జీ, కామ్సీ మక్వానా, హకుబా జడేజా ఉన్నారు.

మంగళవారం గుజరాత్‌లో రాజ్యసభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా పార్టీ అభ్యర్థి అహ్మద్‌ పటేల్‌కు ఓటువేయాలని విప్‌ జారీ చేసింది. అయితే, కానీ మొత్తం 14మంది ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయాన్ని దిక్కరించి బీజేపీకి ఓటు వేయడంతో వారిపై తాజాగా సస్పెన్షన్‌ వేటు వేసినట్లు గుజరాత్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ అశోక్‌ గెహ్లాట్‌ తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement