కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : మోదీ సర్కార్ రైతులు, చిన్న వ్యాపారులను విస్మరించి, బడా పారిశ్రామికవేత్తలకే దోచిపెడుతోంని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్టీ ఓబీసీ విభాగం కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ పేదలు, అణగారిన వర్గాల శ్రమఫలితాన్ని ఇతరులు అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతరులు చేసిన పనులను ప్రధాని మోదీ తన ఘనతగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.
నైపుణ్యాలు కలిగిన ప్రజలకు భారత్‌లో ఆదరణ లేదని, రైతులు కష్టించి పనిచేసినా వారెప్పుడు ప్రధాని కార్యాలయంలో కనిపించరని అన్నారు. కేవలం 15 మంది పారిశ్రామికవేత్తలకు మోదీ సర్కార్ రూ 2.5లక్షల కోట్లు ఇచ్చిందని, కానీ రైతుకు మాత్రం మొండిచేయి చూపిందని ఆరోపించారు. 15 మంది సంపన్నులకు రుణాలు మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు రుణాలను మాత్రం మాఫీ చేయడం లేదని విమర్శించారు. దేశంలో ఓబీసీ ఎంతో నైపుణ్యాలు కలిగిన వారైనా ప్రభుత్వం వారికి సరైన చేయూత ఇవ్వడం లేదని రాహుల్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment