ఇంతకీ ఎందుకు.. ఏఐసీసీకి అంత సంతృప్తి?: కేటీఆర్‌ | BRS MLA KTR Serious Comments Over Congress And Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాహుల్‌.. మీరు వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభం?: ‍కేటీఆర్‌

Published Sun, Nov 17 2024 9:14 AM | Last Updated on Sun, Nov 17 2024 9:14 AM

BRS MLA KTR Serious Comments Over Congress And Rahul Gandhi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ పాలన తీరు, హస్తం పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీపై మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. నేను కొట్టినట్లు చేస్తా.. నువ్వు ఏడ్చినట్లు చేయి అనే ఒప్పందమా?.. కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా?.. రేవంత్ - అదానీలతో వ్యాపార బంధమా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణకు కాంగ్రెస్ తరతరాల దరిద్రం అంటూ ఘాటు విమర్శలు చేశారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..
‘రాహుల్ గాంధీ గారూ..
మీరు భూసేకరణ వ్యతిరేక స్వరం వినిపిస్తే ఏం లాభం?
అదానీ-అంబానీలపై విరుచుకుపడితే ఏం ప్రయోజనం?

దేశవ్యాప్తంగా భూసేకరణపై మీ రణ గర్జన..
తెలంగాణలో భూసేకరణను ఎందుకు అడ్డుకోలేకపోయింది?
కొడంగల్ రైతుల కన్నీటికి ఎందుకు కారణభూతమైంది?

అదానీ-అంబానీలపై మీ జంగ్..
రామన్నపేటలో అదానీ ఫ్యాక్టరీకి ద్వారాలు ఎందుకు తెరిచింది?
తెలంగాణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే కదా! ఎందుకు అభ్యంతరం చెప్పలేదు?

నేను కొట్టినట్లు చేస్తా..
నువ్వు ఏడ్చినట్లు చేయి అనే ఒప్పందమా?
కుమ్మక్కు రాజకీయంలో ఇదో రహస్యమా?
రేవంత్-అదానీలతో వ్యాపార బంధమా?

అదానీ-అంబానీలపై మీ పోరాటం ఓ బూటకం
తెలంగాణకు కాంగ్రెస్ తరతరాల దరిద్రం..’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ఇదే సమయంలో 
రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి చెందిందా ??!!
అసలు రాష్ట్రంలో పాలన అనేది ఒకటి ఉంటే కదా..? ఇంతకంటే దిక్కుమాలిన ప్రకటన ఇంకోటి ఉంటదా..!!

ఇంతకీ ఎందుకు.. ఏఐసీసీకి అంత సంతృప్తి ?
తెలంగాణ రైతులకు సంకెళ్లు వేసినందుకా ?

❌అమాయకులైన అన్నదాతలను జైలులో పెట్టినందుకా ??
❌కొడంగల్ లో బలవంతంగా భూములు గుంజుకున్నందుకా ??
❌కొనుగోలు కేంద్రాల్లో రైతులను బలిపశువులను చేస్తున్నందుకా ??
❌మూసీ ప్రాజెక్టులో భాగంగా వేల ఇళ్ల కూల్చివేతకు సిద్ధమైనందుకా ??
❌హైడ్రా పేరిట పేద ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నందుకా ??
❌ఏడాది కావస్తున్నా గ్యారెంటీ కార్డును పాతాళంలో పాతిపెట్టినందుకా ??
❌రెండు లక్షల ఉద్యోగాల హామీ అమలును గాలికి వదిలేసినందుకా ??
❌తెలంగాణ ప్రగతికి బ్రేకులు వేసి.. ఆర్థికంగా దివాలా తీయిస్తున్నందుకా ??
❌సంక్షేమానికి సమాధి కట్టి.. అభివృద్ధికి అడ్రస్ లేకుండా చేసినందుకా ??

తెలంగాణలోని సకల రంగాలను.. 
సబ్బండ వర్గాలను దగా చేసినందుకా.. 
మొత్తంగా తెలంగాణను ఆగం చేసినందుకా.. 
మీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అంతటి సంతృప్తి ??

ఢిల్లీకి అందుతున్న వేల కోట్ల మూటలు చూసి మీరెంత మురిసిపోయినా.. మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రిని.. గ్యారెంటీ కార్డు ఇచ్చి గారడీ చేసిన కాంగ్రెస్ పార్టీని చూసి, నాలుగు కోట్ల తెలంగాణ సమాజం మాత్రం రగిలిపోతోంది. కనికరం లేని కాంగ్రెస్ పాలనకు కర్రుగాల్చి వాతపెడుతుంది.
జై తెలంగాణ అంటూ కామెంట్స్‌ చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement