
గువహటి: రుణ ఎగవేత కేసులో అసోం మాజీ సీఎం హితేశ్వర్ సైకియా కుమారుడు, కాంగ్రెస్ నేత దేబబ్రత సైకియాకు ఎదురు దెబ్బ తగిలింది. పాతికేళ్ల నాటి 9 లక్షల రూపాయల లోన్ డిఫాల్ట్ కేసులో సైకియా సోదరడు అశోక్ సైకియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసేలో సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరు కానందున అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
సోమవారం కోర్టులో హాజరు పర్చనున్నామని గువహటి సీబీఐ అధికారులు తెలిపారు. దీనిపై హితేశ్వర్ అసోం కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రతిపక్ష నాయకుడు దేబబ్రత సైకియా స్పందించారు. అరెస్టు చేశారో లేదా అదుపులోకి తీసుకున్నారో అసలు అతడిని ఎక్కడికి తీసుకెళ్లారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. అంతేకాదు పరిష్కారమై పోయిన చాలా పాత కేసు అని, బ్యాంక్ కోర్టుకు సమాచారం అందించకపోవడం బ్యాంకుది తప్పు దేబబ్రత అన్నారు.
మరోవైపు 1996లో అస్సాం స్టేట్ కో-ఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకు ద్వారా సంబంధిత రుణాన్ని తీసుకున్నానని వ్యాపారవేత్త అశోక్ సైకియా ఒక ప్రకటనలో తెలిపారు. అయితే 2011లో రుణాన్ని తిరిగి చెల్లించానని, ప్రస్తుతం టువంటి బకాయిలు పెండింగ్‌లో లేవని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2015 అక్టోబర్ 28న బ్యాంకు జనరల్ మేనేజర్ అధికారిక లేఖను కూడా ఆయన ప్రస్తావించారు. కానీ రుణ ఎగవేత అంటూ నిరాధార అరోపణలు ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వానికి, సీబీఐకే తెలియాలంటూ ఎద్దేవాచేశారు.
బీజేపీలోకి చేరునున్నట్టు బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులను సీబీఐ ద్వారా భయపెట్టే వ్యూహాన్ని బీజేపీ దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని విమర్శించారు. కాగా కోల్‌కతా బ్రాంచ్‌లో అశోక్ సైకియాపై నమోదైన రెండు ఫిర్యాదుల మేరకు పల్టాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో గతంలో కేసు నమోదైంది. ఆ తరువాత 2001లో ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది. దీంతో పాటు 2013లో మరో కేసులో దోషిగా నిర్ధారించబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment