'ఇది మాకు నూతన సంవత్సర కానుక' | Engineer Ankamma Rao family get New Year gift | Sakshi
Sakshi News home page

'ఇది మాకు నూతన సంవత్సర కానుక'

Published Tue, Dec 31 2013 11:01 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

'ఇది మాకు నూతన సంవత్సర కానుక' - Sakshi

'ఇది మాకు నూతన సంవత్సర కానుక'

చీరాల : ఇంజనీర్ అంకమ్మరావు విడుదలతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తన భర్త క్షేమంగా విడుదల కావటం చాలా ఆనందంగా ఉందని అంకమ్మరావు భార్య వాణి తెలిపారు. ఇది తమకు నూతన సంవత్సర కానుక అని ఆమె అన్నారు. అంకమ్మరావు తమతో ఫోన్లో మాట్లాడరని, ప్రస్తుతం అసోంలోనే ఉన్నారని, బుధవారం చీరాల వస్తారని తెలిపారు. తన భర్త బోడోల చెరలో  ఉన్న ఈ పదిరోజులు తాము నరకం చూశామని వాణి  కన్నీటి పర్యంతమయ్యారు.


కాగా ఇంజనీర్‌ అంకమ్మరావును ఈ రోజు తెల్లవారుజామున... నాలుగు గంటలకు బోడో తీవ్రవాదులు  విడుదల చేశారు. తాను
క్షేమంగా వున్నట్లు కుటుంబ సభ్యులకు అంకమ్మరావు ఫోన్‌ చేసి చెప్పారు. ఈ నెల 22న అసోంలోని ఆమ్‌గురిలో అంకమ్మరావును బోడో తీవ్రవాదులు కిడ్నాప్‌ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement