Bodo militants
-
బోడో తీవ్రవాదుల ఏరివేతకు రంగం సిద్ధం
న్యూఢిల్లీ : బోడో తీవ్రవాదులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. తీవ్రవాదుల ఏరివేతకు రంగం సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. 50 పారా మిలటరీ దళాలను రంగంలోకి దించుతున్నట్లు రాజ్‌నాథ్ వెల్లడించారు. అవసరం అయితే బోడో తీవ్రవాదుల స్థావరాలపై చర్యలు చేపట్టేందుకు పొరుగు దేశాలు అయిన భూటాన్, మయన్మార్ సాయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈనేపథ్యంలో ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ శుక్రవారం రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. అసోంలో తాజా పరిణామాలు, బోడో తీవ్రవాదుల ఏరివేత అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా అస్సాంలో మిలిటెంట్ల దాడిలో మృతి చెందినవారి సంఖ్య 83కి చేరింది. మరోవైపు అస్సాంలోని సోనిత్ పూర్ జిల్లాలో హోంమంత్రి నిన్న పర్యటించిన విషయం తెలిసిందే. -
'బోడో తీవ్రవాదులతో చర్చలు జరపం'
గువాహటి: బోడో తీవ్రవాదులతో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. అమాయక ఆదివాసీలను దారుణంగా కాల్చిచంపిన తీవ్రవాదులతో కేంద్రం చర్చలు జరపబోదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)తో విచారణ జరిపిస్తామన్నారు. అసోంలోని సోనిత్పూర్ జిల్లాలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అసోం పోలీసులు, పారామిలటరీ, సైన్యం సహకారంతో తీవ్రవాద తండాలను తుదముట్టిస్తామని చెప్పారు. ఇందుకోసం అసోంకు ఇప్పటికే 50 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను పంపినట్టు వెల్లడించారు. శాంతి, సంయమనం పాటించాలని ఆయన వివిధ వర్గాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన ఆదివాసీల కుటుంబ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారని రాజ్‌నాథ్ తెలిపారు. -
అస్సాం అంతా రెడ్ అలర్ట్..!
-
అస్సాంలో మిలిటెంట్ల దాడి : 52మంది మృతి
-
అస్సాంలో 48కి పెరిగిన మృతులు
గువాహటి: ఈశాన్య రాష్ర్టమైన అస్సాంలో బోడో మిలిటెంట్లు మంగళవారం జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య 48కి పెరిగింది. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. సోనిత్పూర్, కోక్రాఝర్ జిల్లాల్లోని ఐదు వేర్వేరు ప్రాంతాల్లో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ (ఎన్డీఎఫ్బీ) సోంగ్‌బిజిత్ ఫాక్షన్ వర్గానికి చెందిన మిలిటెంట్లు ఆదివాసీ గ్రామాలపై మెరుపు దాడులు చేసి మారణహోమం సృష్టించారు. అరుణాచల్‌ప్రదేశ్-భూటాన్ సరిహద్దులో ఉన్న సోనిత్పూర్ జిల్లాలోని మైతులాబస్తీలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు మిలిటెంట్లు కాల్పులు ప్రారంభించారని పోలీసులు తెలిపారు. పబొయ్ రిజర్వు ఫారెస్ట్ లో 23 మృతదేహాలను గుర్తించారు.కోక్రాఝర్ జిల్లాలోని ఉల్తాపానీ గ్రామంపైనా మిలిటెంట్లు దాడి చేశారు. -
37 మంది ఆదివాసీల కాల్చివేత
అస్సాంలో బోడో మిలిటెంట్ల ఘాతుకం గువాహటి: ఈశాన్య రాష్ర్టమైన అస్సాంలో బోడో మిలిటెంట్లు నరమేధం సృష్టించారు. సోనిత్పూర్, కోక్రాఝర్ జిల్లాల్లోని ఐదు వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ (ఎన్డీఎఫ్బీ) సోంగ్‌బిజిత్ ఫాక్షన్ వర్గానికి చెందిన మిలిటెంట్లు ఆదివాసీ గ్రామాలపై మెరుపు దాడులు చేసి 37 మందిని విచక్షణారహితంగా కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో మరో 10 మంది గాయపడ్డారు. ఒక్క సోనిత్పూర్ జిల్లాలోనే 30 మంది అమాయక ఆదివాసీలను హతమార్చిన మిలిటెంట్లు, కోక్రాఝర్ జిల్లాలో ఏడుగురిని పొట్టనపెట్టుకున్నారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్‌తో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు వెంబడి భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేసినందుకు ప్రతీకారంగానే మిలిటెంట్లు ఈ మారణహోమానికి పాల్పడ్డారని అస్సాం ఐజీపీ (శాంతిభద్రతలు) ఎస్.ఎన్. సింగ్ పేర్కొన్నారు. శాంతి చర్చలను వ్యతిరేకిస్తున్న మిలిటెంట్లే ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అస్సాం అదనపు డీజీపీ పల్లభ్ భట్టాచార్య తెలిపారు. మరోవైపు మిలిటెంట్ల ఘాతుకాన్ని ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తీవ్రంగా ఖండించారు. మిలిటెంట్ల మారణహోమాన్ని పిరికిపంద చర్యగా మోదీ అభివర్ణించారు. ఈ ఘటన నేపథ్యంలో రాజ్‌నాథ్ అస్సాంలో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకుంటారన్నారు. దాడుల ప్రాంతాలకు పారామిలిటరీ దళాలను పంపినట్లు రాజ్‌నాథ్ చెప్పారు. -
కిడ్నాపైన ఏపీ కాంట్రాక్టర్ క్షేమంగా విడుదల
హైదరాబాద్/రాయచోటి/రామాపురం/సాక్షి,న్యూఢిల్లీ: అస్సాం లో కిడ్నాపైన ఆంధ్రప్రదేశ్ సివిల్ కాంట్రాక్టర్ పప్పిరెడ్డి మహేశ్వరరెడ్డి సోమవారం క్షేమంగా బయటపడ్డారు. బోడో మిలిటెంట్లుగా భావిస్తున్న కొంతమంది ఆయన్ను కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. మహేశ్వరరెడ్డికి ఎలాంటి హాని తలపెట్టవద్దని కుటుంబ సభ్యులు, అక్కడి ప్రభుత్వ యంత్రాంగం, సైబరాబాద్ పోలీసులు, ప్రజా ప్రతినిధులు కోరడంతో ఆగంతకులు స్పందించారు. ఎలాంటి డిమాండ్లు చేయకుండా కిడ్నాపర్లు ఆయన్ను విడిచిపెట్టారు. తాను విడుదలైన విషయాన్ని మహేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు అస్సాం బయలుదేరారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది. -
మహేశ్వర్ రెడ్డి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ ఫోన్
హైదరాబాద్ : అసోంలో కిడ్నాప్ అయిన సివిల్ కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఆయన ఈ సందర్బంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని మహేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ సూచించారు. కిడ్నాప్ వ్యవహారాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళతామని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ ఎంపీలు అవినాష్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి ఢిల్లీలో ఉండి ఈ ఘటనపై ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని వైఎస్ జగన్ ఆదేశించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ మహేశ్వర్ రెడ్డిని అసోంలోని దివాస్ జిల్లా గౌడీ(అటవీ) ప్రాంతంలో బోడో మిలిటెంట్లు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. మహేశ్వరరెడ్డి స్వస్థలం వైఎస్సార్ జిల్లా రామాపురం మండలం హసనాపురం. క్లాస్‌వన్ కాంట్రాక్టర్ అయిన మహేశ్వరరెడ్డి హసనాపురం గ్రామానికి గతంలో సర్పంచ్‌గా కూడా పనిచేశారు. గత మూడేళ్ల నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య సుభద్రమ్మ, కూతురు నిశిత, కొడుకు మంజునాథ్ ఉన్నారు. ప్రస్తుతం మహేశ్వరరెడ్డి గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, అసోం రాష్ట్రాలలో ఐఎల్ఎఫ్ (రాంకీ కంపెనీ )లో సబ్ కాంట్రాక్టర్‌గా పనులు చేయిస్తున్నారు. -
ఇద్దరు తెలుగు ఉద్యోగుల అపహరణ
అసోం : అసోంలో ఇద్దరు తెలుగువారిని బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్ అయిన రఘు, ప్రదీప్‌లు పృధ్వీ కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్ వైజర్లుగా పనిచేస్తున్నారు. వారిని విడుదల చేసేందుకు తీవ్రవాదులు రూ.20 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. కాగా తమ కుమారుల కిడ్నాప్ సమాచారం అందుకున్న వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిడ్నాప్ అయినవారిలో ఒకరు విజయవాడకు చెందినవారు. కాగా గతంలోనూ బోడో తీవ్రవాదులు....అక్కడ పనిచేసే తెలుగు వారిని అపహరించుకు వెళ్లిన విషయం తెలిసిందే. -
అస్సాంలో ఉద్రిక్తత
అపహరణకు గురైన నలుగురి మృతదేహాలు స్వాధీనం గువాహటి: అస్సాంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. శుక్రవారం బోడో తీవ్రవాదులు అపహరించిన నలుగురిలో ముగ్గురి మృతదేహాలను బక్సా జిల్లాలోని బేకీ నది నుంచి ఆదివారం పోలీసులు వెలికితీశారు. మరోమైపు కిడ్నాప్‌నకు నిరసనగా సల్బరీ సబ్ డివిజన్, ఆనంద్‌బజార్ ప్రాంతాల్లో స్థానికులు ఆందోళనకు దిగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. నేషనల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ (ఎన్డీఎఫ్బీ) మిలిటెంట్లు శుక్రవారం బార్పేట జిల్లాకు చెందిన అతావూర్ రహమాన్(27), రూబుల్ అమీన్ (45), సద్దాం అలీ(13), బకర్ అలీ (13)లను అపహరించారు. వీరిలో బకర్ అలీ మృతదేహాన్ని శనివారమే బేకీ నది నుంచి స్వాధీనం చేసుకోగా.. మిగిలిన ముగ్గురి మృతదేహాలను ఆదివారం వెలికితీశారు. మరోవైపు వీరి అంత్యక్రియలు నిర్వహించేందుకు నిరాకరించిన కుటుంబ సభ్యులు.. తమపై వేధింపులకు సంబంధించి ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ స్పందించాలని డిమాండ్ చేశారు. తాజా ఘటనల నేపథ్యంలో అప్రమత్తమైన అస్సాం ప్రభుత్వం శనివారం ఉదయం నుంచి సల్బరీ సబ్ డివిజన్, ఆనంద్‌బజార్ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి.. భారీగా బలగాలను మోహరించింది. ముందు జాగ్రత్త చర్యగా సైన్యాన్ని కూడా రప్పించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది మేలో బక్సా, కోక్రాఝర్ ప్రాంతాల్లో చెలరేగిన హింసలో బోడో తీవ్రవాదుల చేతుల్లో 50 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. -
ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసింది విద్యార్థులే!
అసోం: అసోంలో ఇంజినీర్‌ను కిడ్నాప్ చేసింది విద్యార్థులేనని పోలీసులు తేల్చారు. అసోం విశిష్ట కనస్ట్రక్షన్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న నాగమల్లేశ్వరరావును బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేసినట్లుగా తొలుత భావించారు. కాగా, ఆ ఇంజనీర్ ను కిడ్నాప్ చేసింది ఆ సంస్థ విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. ఈ నెల 17న ఇంజనీర్ అపహరణకు గురయ్యారు. ప్రస్తుతం కిడ్నాపర్ల తల్లిదండ్రులు పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన నాగమల్లేశ్వరరావును సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై అసోం సీఎస్, డీజీపీలతో కృష్ణారావు మాట్లాడారు. ఇంజినీర్ విడుదలకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. నాగమల్లేశ్వరరావును రేపు మధ్యాహ్నానికి విడిపించి తెస్తామని పోలీసులు చెప్పారు. -
అసోంలో ఆంధ్ర ఇంజినీర్ కిడ్నాప్
అసోంలో ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కేవీపాలెంకు చెందిన ఇంజినీర్ బండమూరి నాగమల్లేశ్వరరావును ఆగంతకులు కిడ్నాప్ చేశారు. అసోంలోని వశిష్ట నిర్మాణ కంపెనీలో ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన్ని ఈ నెల 17న ఆగంతకులు కిడ్నాప్ చేశారు. నాగమల్లేశ్వరరావును విడుదల చేయాలంటే రూ.10 లక్షలు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే నాగమల్లేశ్వరరావును కిడ్నాప్ చేసింది బోడో తీవ్రవాదులని అనుమానిస్తున్నారు. -
భగవంతుడే కాపాడాడు...
*బోడో తీవ్రవాదుల చెర నుంచి విడుదలైన అంకమ్మరావు కుటుంబ సభ్యుల ఆనందం *నూతన సంవత్సరంలో సంతోషమైన వార్త విన్నామన్న భార్య వాణి *రెండు రోజుల్లో చీరాల చేరుకోనున్న అంకమ్మరావు చీరాల : బతుకుదెరువు కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లి బోడో తీవ్రవాదుల చెరలో చిక్కుకున్న తొమ్మిదిరోజులు తర్వాత క్షేమంగా తిరిగి వచ్చాడు చీరాలకు చెందిన ఇంజినీర్ బత్తుల అంకమ్మరావు. మంగళవారం ఉదయం ఆయన్ని తీవ్రవాదులు విడుదల చేశారు. ఈ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవు. అసోం లో బొలినేని శీనయ్య నిర్మాణ సంస్థలో సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అంకమ్మరావు డిసెంబర్ 22 సాయంత్రం విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా తీవ్రవాదుల చేతిలో కిడ్నాప్ అయిన విషయం విదితమే. అంకమ్మరావు కిడ్నాప్‌నకు గురయ్యాడని తెలుసుకున్న భార్య వాణి, కుటుంబ సభ్యులు అప్పటి నుంచి మనోవే దనకు గురయ్యారు. ఆయన్ను క్షేమంగా విడిచిపెట్టాలని వేడుకున్నారు. సంఘటనపై స్పందించి చర్యలు చేపట్టాలని బీసీ సంఘాల ఆధ్వర్యంలో చీరాలలో ధర్నా, ర్యాలీలు నిర్వహించారు. ఎట్టకేలకు తీవ్రవాదులు అంకమ్మరావును విడుదల చేశారు. మరో రెండు రోజుల్లో ఆయన చీరాలకు రానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంతో సంతోషంగా ఉంది -బత్తుల వాణి, ఇంజినీర్ భార్య నా భర్త బోడో తీవ్రవాదుల చెర నుంచి విడుదలయ్యాడన్న వార్త ఎంతో సంతోషాన్నిచ్చింది. నూతన సంవత్సరంలో సంతోషకరమైన వార్త విన్నాను. భగవంతుడే నా భర్తను కాపాడాడు. పిల్లలతో, నాతో ఆయన ఫోన్లో మాట్లాడారు. కిడ్నాప్‌నకు గురైన నాటి నుంచి మీడియా, పోలీస్, రెవెన్యూవారు ఎంతో సహకారం అందించారు. అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. -
'ఇది మాకు నూతన సంవత్సర కానుక'
చీరాల : ఇంజనీర్ అంకమ్మరావు విడుదలతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తన భర్త క్షేమంగా విడుదల కావటం చాలా ఆనందంగా ఉందని అంకమ్మరావు భార్య వాణి తెలిపారు. ఇది తమకు నూతన సంవత్సర కానుక అని ఆమె అన్నారు. అంకమ్మరావు తమతో ఫోన్లో మాట్లాడరని, ప్రస్తుతం అసోంలోనే ఉన్నారని, బుధవారం చీరాల వస్తారని తెలిపారు. తన భర్త బోడోల చెరలో ఉన్న ఈ పదిరోజులు తాము నరకం చూశామని వాణి కన్నీటి పర్యంతమయ్యారు. కాగా ఇంజనీర్ అంకమ్మరావును ఈ రోజు తెల్లవారుజామున... నాలుగు గంటలకు బోడో తీవ్రవాదులు విడుదల చేశారు. తాను క్షేమంగా వున్నట్లు కుటుంబ సభ్యులకు అంకమ్మరావు ఫోన్ చేసి చెప్పారు. ఈ నెల 22న అసోంలోని ఆమ్గురిలో అంకమ్మరావును బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. -
బోడో తీవ్రవాదుల చెరనుంచి ఇంజినీరుకు విముక్తి
-
బోడో తీవ్రవాదుల చెరనుంచి ఇంజినీరుకు విముక్తి
విశాఖ : ఈ నెల 22వ తేదీన అసోంలో కిడ్నాప్‌కు గురైన విశాఖ ఇంజనీర్ అంకమ్మరావుకు బోడో తీవ్రవాదుల చెర నుంచి విముక్తి లభించింది. తీవ్రవాదులు అతనిని కిడ్నాప్ చేసిన ప్రాంతంలోనే విడిచి పెట్టివెళ్లారు. అసోంలోని బొల్లినేని శ్రీనయ్య అండ్ కంపెనీలో అంకమరావు సీనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అంకన్రావు స్వస్థలం ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలంలోని జాగర్లమూడి. కాగా అంకమ్మరావు క్షేమంగా విడుదల కావటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో కాంట్రాక్టర్ పనుల నిర్వహణలో భాగంగా బస్సులో బయలుదేరిన అంకమ్మరావును బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. -
ఇంజనీరు అంకన్రావు కిడ్నాప్‌పై కనిపించని పురోగతి
అసోం: చిరంగ్ జిల్లాలో ఆదివారం కిడ్నాప్‌కు గురైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంజనీర్ బత్తుల అంకన్రావు కిడ్నాప్ కేసుపై మూడురోజులైన పురోగతి కనిపించలేదు. ఇంకా అంకన్రావు బోడో తీవ్రవాదుల చెరలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇటు రాష్ట్రప్రభుత్వ స్థాయిలోనూ స్పందన కరువు కాగా. అటు స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో అంకన్రావు కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసోంలోని చిరంగ్ జిల్లాలో ఆదివారం అంకన్రావు పనిచేస్తున్న సైట్లో పనులు ముగించుకుని మరో ముగ్గురు సూపర్వైజర్లతో కలిసి కారులో బస చేసిన ప్రాంతానికి తిరిగి వస్తుండగా సాయంత్రం ఆయుధాలు ధరించిన బోడో మిలిటెంట్లు అటకాయించి వారిపై దాడి చేసి బంధించిన సంగతి తెలిసిందే. వారిలో ముగ్గురిని విడిచిపెట్టగా అంకన్ రావును మాత్రం తీవ్రవాదులు వదిలిపెట్టలేదు. ఈ విషయాన్ని కంపెనీ ఉద్యోగులు అంకమ్మరావు భార్యకు ఆదివారం రాత్రి సమాచారమిచ్చారు. ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం జాగర్లమూడి గ్రామానికి చెందిన అంకమ్మరావు హైదరాబాద్‌కు చెందిన బొల్లినేని శీనయ్య నిర్మాణ కంపెనీలో పదేళ్లుగా పనిచేస్తున్నారు. ఆ కంపెనీ అసోంలోని ఆమ్‌గుడి గ్రామంలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్‌కు సంబంధించిన కాంట్రాక్టు చేపట్టింది. అక్కడి అంకమ్మరావు ఏడాది నుంచి సైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. అంకమ్మరావు గురించి అన్వేషణ ప్రారంభించామని, మిలిటెంట్ల డిమాండ్లు ఇంకా చెప్పలేదని అన్నారు.