న్యూఢిల్లీ : బోడో తీవ్రవాదులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. తీవ్రవాదుల ఏరివేతకు రంగం సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. 50 పారా మిలటరీ దళాలను రంగంలోకి దించుతున్నట్లు రాజ్నాథ్ వెల్లడించారు. అవసరం అయితే బోడో తీవ్రవాదుల స్థావరాలపై చర్యలు చేపట్టేందుకు పొరుగు దేశాలు అయిన భూటాన్, మయన్మార్ సాయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఈనేపథ్యంలో ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ సుహాగ్ శుక్రవారం రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. అసోంలో తాజా పరిణామాలు, బోడో తీవ్రవాదుల ఏరివేత అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా అస్సాంలో మిలిటెంట్ల దాడిలో మృతి చెందినవారి సంఖ్య 83కి చేరింది. మరోవైపు అస్సాంలోని సోనిత్ పూర్ జిల్లాలో హోంమంత్రి నిన్న పర్యటించిన విషయం తెలిసిందే.
బోడో తీవ్రవాదుల ఏరివేతకు రంగం సిద్ధం
Published Fri, Dec 26 2014 10:17 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM
Advertisement