ఇంజనీర్ను కిడ్నాప్ చేసింది విద్యార్థులే! | Students kidnapped Engineer | Sakshi
Sakshi News home page

ఇంజనీర్ను కిడ్నాప్ చేసింది విద్యార్థులే!

Published Sun, Jun 22 2014 8:20 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

Students kidnapped Engineer

అసోం: అసోంలో ఇంజినీర్ను కిడ్నాప్ చేసింది విద్యార్థులేనని పోలీసులు తేల్చారు. అసోం విశిష్ట కనస్ట్రక్షన్  కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న నాగమల్లేశ్వరరావును బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేసినట్లుగా తొలుత భావించారు. కాగా, ఆ ఇంజనీర్ ను కిడ్నాప్ చేసింది ఆ సంస్థ విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. ఈ నెల 17న ఇంజనీర్ అపహరణకు గురయ్యారు. ప్రస్తుతం కిడ్నాపర్ల తల్లిదండ్రులు పోలీసుల అదుపులో ఉన్నారు.

 ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన నాగమల్లేశ్వరరావును సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఐవైఆర్ కృష్ణారావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై  అసోం సీఎస్, డీజీపీలతో కృష్ణారావు మాట్లాడారు. ఇంజినీర్‌ విడుదలకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. నాగమల్లేశ్వరరావును రేపు మధ్యాహ్నానికి  విడిపించి తెస్తామని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement