బోడో తీవ్రవాదుల చెరనుంచి ఇంజినీరుకు విముక్తి | Assam: Bodo Militants release kidnapped Andhra engineer ankamarao | Sakshi
Sakshi News home page

బోడో తీవ్రవాదుల చెరనుంచి ఇంజినీరుకు విముక్తి

Published Tue, Dec 31 2013 8:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM

Assam: Bodo Militants release kidnapped Andhra engineer ankamarao

విశాఖ : ఈ నెల 22వ తేదీన అసోంలో కిడ్నాప్కు గురైన విశాఖ ఇంజనీర్‌ అంకమ్మరావుకు బోడో తీవ్రవాదుల చెర నుంచి  విముక్తి లభించింది. తీవ్రవాదులు అతనిని కిడ్నాప్ చేసిన ప్రాంతంలోనే విడిచి పెట్టివెళ్లారు. అసోంలోని బొల్లినేని శ్రీనయ్య అండ్ కంపెనీలో అంకమరావు సీనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.

అంకన్‌రావు స్వస్థలం ప్రకాశం జిల్లా  యద్దనపూడి మండలంలోని జాగర్లమూడి. కాగా అంకమ్మరావు క్షేమంగా విడుదల కావటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.  పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో కాంట్రాక్టర్ పనుల నిర్వహణలో భాగంగా బస్సులో బయలుదేరిన అంకమ్మరావును బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement