గువాహటి: ఈశాన్య రాష్ర్టమైన అస్సాంలో బోడో మిలిటెంట్లు మంగళవారం జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య 48కి పెరిగింది. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. సోనిత్‌పూర్, కోక్రాఝర్ జిల్లాల్లోని ఐదు వేర్వేరు ప్రాంతాల్లో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ (ఎన్‌డీఎఫ్‌బీ) సోంగ్‌బిజిత్ ఫాక్షన్ వర్గానికి చెందిన మిలిటెంట్లు ఆదివాసీ గ్రామాలపై మెరుపు దాడులు చేసి మారణహోమం సృష్టించారు.
అరుణాచల్‌ప్రదేశ్-భూటాన్ సరిహద్దులో ఉన్న సోనిత్‌పూర్ జిల్లాలోని మైతులాబస్తీలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు మిలిటెంట్లు కాల్పులు ప్రారంభించారని పోలీసులు తెలిపారు. పబొయ్ రిజర్వు ఫారెస్ట్ లో 23 మృతదేహాలను గుర్తించారు.కోక్రాఝర్ జిల్లాలోని ఉల్తాపానీ గ్రామంపైనా మిలిటెంట్లు దాడి చేశారు.
అస్సాంలో 48కి పెరిగిన మృతులు
Published Wed, Dec 24 2014 8:01 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM
Advertisement