కొనసాగుతున్న నాలుగోదశ పోలింగ్ | 4th Phase of Lok Sabha Polls: Queue outside polling stations | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న నాలుగోదశ పోలింగ్

Published Sat, Apr 12 2014 9:12 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

కొనసాగుతున్న నాలుగోదశ పోలింగ్ - Sakshi

కొనసాగుతున్న నాలుగోదశ పోలింగ్

న్యూఢిల్లీ :సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికల పోలింగ్ శనివారం కొనసాగుతోంది.  నాలుగు రాష్ట్రాల్లోని ఏడు లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు  ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏడు గంటల నుంచే సందడి కనిపిస్తోంది.

గోవాలో ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నాలుగో దశ ఎన్నికల్లో అసోంలో మూడు, గోవాలో రెండు, త్రిపుర, సిక్కింలలో ఒక్కో స్థానానికి పోలింగ్ సాగుతోంది. వీటితో పాటు సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు సాగుతున్నాయి. మొత్తం 74 మంది అభ్యర్థులు బరిలో ఉండగా దాదాపు 50 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement