న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. ప్రచార పర్వం కొనసాగుతుండగానే పోలింగ్ పర్వానికి తెర లేచింది. తొమ్మిది దశల్లో సాగే పోలింగ్‌కు సంబంధించి తొలి దశ సోమవారం పోలింగ్ ప్రారంభమైంది. అసోం, త్రిపురల్లో జరుగుతున్న మొదటి దశ పోలింగ్‌కు ఓటర్లు అప్పుడే బారులు తీరుతున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌లో ఓటు వేసేందుకు ప్రజలు ఉత్సాహంగా తరలి వస్తున్నారు.
సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. మొదటి దశలో అసోంలో 5 లోక్‌సభ స్థానాలు, త్రిపురలో ఒక స్థానానికి పోలింగ్ జరగుతోంది. అసోంలో మొత్తం 14 స్థానాలుండగా 51 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అభ్యర్థుల్లో 5 గురు మహిళలకు చోటు లభించగా 13 మంది కోటీశ్వరులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దాదాపు 64 లక్షల మంది ఓటర్లు కాంగ్రెస్, బీజేపీ, ఏజేపీల భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. అటు... త్రిపురలో 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ఒక మహిళ అభ్యర్థి కూడా రంగంలో ఉన్నారు.
ప్రారంభమైన మొదటి దశ పోలింగ్
Published Mon, Apr 7 2014 8:16 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement