
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం కేరళలో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలు అహోరాత్రాలు చెమటోడుస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. నమో యాప్ ద్వారా శనివారం ఆయన వారితో ముచ్చటించారు.
అధికార లెఫ్ట్ కూటమి నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నా బీజేపీ కార్యకర్తలు చూపుతున్న పట్టుదల, ఉత్సాహం ప్రశంసనీయమన్నారు. వారి త్యాగం, క్రమశిక్షణ, కష్టించే తత్వం తనకు స్ఫూర్తిగా నిలిచి శక్తినిస్తున్నాయని మోదీ అన్నారు. ఇంటింటికీ వెళ్లి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేపట్టినట్టు కార్యకర్తలు ఆయనకు వివరించారు. కేరళలో ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరగనుంది.