కేరళ ప్రజలు అవినీతి, అసమర్థ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో కమలం వికసిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఎ అభ్యర్థుల కోసం నిర్వహించిన బహిరంగ ప్రచారంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో కేరళ ప్రజలు మమ్మల్ని రెండంకెల ఓట్ల శాతం పార్టీగా మార్చారు. ఈ సారి కూడా కమలం వికసిస్తుందని, ప్రజలకు మంచి రోజులు వస్తాయని మోదీ పేర్కొన్నారు. బీజేపీ యువతను ఎంకరేజ్ చేస్తోందని, పతనంతిట్ట (Pathanamthitta) నుంచి బీజేపీ అభ్యర్థిగా అనిల్ కే ఆంథోనీ పోటీ చేస్తున్నారని, ప్రజలకు సేవ చేసేందుకు ఆయన ఉత్సాహంగా ఉన్నట్లు ప్రధాని తెలిపారు.
కేరళ సంస్కృతిలోని ఆధ్యాత్మికత ఉంది. కానీ రాష్ట్రంలో శాంతిభద్రతలు గణనీయంగా క్షీణించాయని ఆయన అన్నారు. ఈ సమావేశానికి ఎన్‌డీఎ లోక్‌సభ అభ్యర్థులు వి మురళీధరన్ (అట్టింగల్), అనిల్ కె ఆంటోని (పతనంతిట్ట), శోభా సురేంద్రన్ (అలప్పుజా), బైజు కలసాల (మావెలిక్కర) ఇతర నేతలతో పాటు.. ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన పద్మజ వేణుగోపాల్ కూడా ఉన్నారు.
#WATCH | PM Modi addresses a public rally in Kerala's Pathanamthitta, ahead of Lok Sabha elections
— ANI (@ANI) March 15, 2024
"BJP is encouraging the youth here. BJP candidate from Pathanamthitta, Anil K Antony is full zeal to serve you (the public). The politics of Kerala need this kind of freshness.… pic.twitter.com/tirs55XV0c
Comments
Please login to add a commentAdd a comment