రూ.5 వేల కోట్లతో నగరాల అభివృద్ధి
- మున్సిపల్ కమిషనర్లతో సమీక్షలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
- జిల్లా కేంద్రాలుగా మారిన పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
- మున్సిపాలిటీలుగా పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్
- అభివృద్ధి కార్యక్రమాలపై అధ్యయనానికి కమిటీ
- భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు రోడ్ల విస్తరణ చేపట్టాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో రూ.5 వేల కోట్ల రుణంతో అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించనున్నామని పుర పాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మిషన్ భగీరథ పథకం అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పొందిన రుణాలకు ఈ రూ.5 వేల కోట్లు అదనమని తెలిపారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం కోసం 8 మందితో కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్లతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేప ట్టిన పలు కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, పురపాలనలో సైతం దేశం మెచ్చుకునే విధంగా పురోగతి సాధిం చాలని ఆకాంక్షించారు. ప్రజలు ప్రభుత్వం నుంచి అద్భుతాలు, చమత్కారాలు ఆశించ డంలేదని, కనీస సదుపాయాలు కోరుకుం టున్నారని పేర్కొన్నారు. పట్టణాల్లో తాగునీటి సరఫరా, శ్మశానాలు, మార్కెట్లు, బస్ బేల ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
మున్సిపాలిటీల్లో సిటిజన్ సర్వీస్ సెంటర్లు
జిల్లా కేంద్రాలుగా ఏర్పడిన పట్టణాల్లో భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు రోడ్ల విస్తరణ చేపట్టాలని కేటీఆర్ సూచించారు. మున్సి పాలిటీ కార్యాలయాలకు సమస్యలు, ఫిర్యా దులతో వచ్చే వారితో స్పందించాల్సిన తీరు బాగుండాలని, ఇందుకోసం ప్రతి మున్సి పాలిటీలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో సిటిజన్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రతి మున్సిపాలిటీకి రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నిర్మించిన మహాప్రస్థానం ఆధునిక శ్మశానవాటిక తరహాలోనే నగరంలో మరో 10 శ్మశానాలను ఏర్పాటు చేయను న్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లోనూ ఈ తరహా శ్మశానాల ఏర్పా టు కు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచిం చారు. పబ్లిక్ స్థలాల్లో అనధికార హోర్డింగుల ఏర్పాటుపై ఉక్కుపాదం మోపా లని ఆదేశించారు. పట్టణాల్లో డంప్ యార్డులను అభివృద్ధి చేయా లని, అక్కడ సువాసనలు వెదజల్లే మొక్కలు నాటాలని సూచించారు. పారి శుధ్య పనులు చేసే కార్మికులకు తప్పనిసరిగా రేడియం జాకెట్లు, బూట్లు, గ్లౌజులు వంటి రక్షణ పరికరాలు అందించాలని పేర్కొన్నారు.
ఈ ఏడాది పనులన్నీ పూర్తి చేస్తాం
అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో పురపాలక శాఖ ఈ ఏడాది గొప్ప పురోగతి సాధిస్తోందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జూన్ 1 నాటికి రాష్ట్రంలోని అన్ని నగ రాలు, పట్టణాలను బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలు(ఓడీఎఫ్)గా తీర్చిదిద్దుతామని, వచ్చే ఏడాది వేసవిలోగా పట్టణాల్లో మిషన్ భగీరథ పనులు పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కేంద్రాలైన నాగర్‌కర్నూల్, జనగామ వంటి చిన్న పట్టణా లను భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లు అభివృద్ధి పరుస్తామని చెప్పారు. జిల్లా కేంద్రాలుగా మారిన పెద్దపల్లి, భూపాల పల్లి, ఆసిఫాబాద్ నగర పంచాయతీలను మున్సిపాలి టీలుగా హోదా పెంచుతామని చెప్పారు. కొత్త జిల్లా కేంద్రాల అభివృద్ధికి కావాల్సిన నిధులు కేటాయి స్తామని, పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత మున్సి పల్ కమిషనర్లదేనని అన్నారు. సమావేశంలో పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, డైరెక్టర్ శ్రీదేవి, పబ్లిక్ హెల్త్ ఇంజ నీరింగ్ విభాగం ఈఎన్‌సీ ధన్ సింగ్ పాల్గొన్నారు.