కేటీఆర్ పొలిటికల్ జోకర్ | Nannuri narsi reddy comments on Minister KTR | Sakshi
Sakshi News home page

కేటీఆర్ పొలిటికల్ జోకర్

Published Mon, Jan 11 2016 4:12 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

కేటీఆర్ పొలిటికల్ జోకర్ - Sakshi

కేటీఆర్ పొలిటికల్ జోకర్

టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు పొలిటికల్ జోకర్‌గా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా 18 ప్రశ్నలతో టీఆర్‌ఎస్ వ్యవహారశైలి, ఆ పార్టీ నేతలు గతంలో అన్న మాటలను గుర్తు చేస్తూ లేఖను విడుదల చేశారు.

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వారం రోజులుగా కేటీఆర్ చెపుతున్న మాటలన్నీ జోకర్ల మాటలను మించిపోయాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు తమ సత్తా చూపుతారని, టీఆర్‌ఎస్‌కు గుణపాఠం నేర్పుతారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement