Nannuri Narsi Reddy
-
కేటీఆర్ పొలిటికల్ జోకర్
టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు పొలిటికల్ జోకర్‌గా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా 18 ప్రశ్నలతో టీఆర్ఎస్ వ్యవహారశైలి, ఆ పార్టీ నేతలు గతంలో అన్న మాటలను గుర్తు చేస్తూ లేఖను విడుదల చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వారం రోజులుగా కేటీఆర్ చెపుతున్న మాటలన్నీ జోకర్ల మాటలను మించిపోయాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రజలు తమ సత్తా చూపుతారని, టీఆర్ఎస్కు గుణపాఠం నేర్పుతారని పేర్కొన్నారు. -
కిషన్‌రెడ్డికి విమర్శించే హక్కులేదు : టీడీపీ
తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న సమయంలో కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా తప్పించుకు తిరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కి షన్రెడ్డికి టీడీపీని విమర్శించే హక్కులేదని ఆ పార్టీ రాష్ట్ర నేతలు బి.శోభారాణి, నన్నూరి నర్సిరెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజనపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూనే ఉందన్నారు. ఇరు ప్రాంతాలకూ న్యాయం జరగాలనే ధ్యేయంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు విధానాన్ని బీజేపీ దుయ్యబట్టడం సరికాదని హితవు పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరిక మేరకు రాష్ట్ర విభజనపై తమ పార్టీ ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ మేరకు వారు ఆదివారం విలేకరులతో మాట్లాడారు.