తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న సమయంలో కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా తప్పించుకు తిరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కి షన్‌రెడ్డికి టీడీపీని విమర్శించే హక్కులేదని ఆ పార్టీ రాష్ట్ర నేతలు బి.శోభారాణి, నన్నూరి నర్సిరెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజనపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూనే ఉందన్నారు.
ఇరు ప్రాంతాలకూ న్యాయం జరగాలనే ధ్యేయంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు విధానాన్ని బీజేపీ దుయ్యబట్టడం సరికాదని హితవు పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరిక మేరకు రాష్ట్ర విభజనపై తమ పార్టీ ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ మేరకు వారు ఆదివారం విలేకరులతో మాట్లాడారు.
కిషన్‌రెడ్డికి విమర్శించే హక్కులేదు : టీడీపీ
Published Sun, Sep 8 2013 9:31 PM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM
Advertisement
Advertisement