సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల నేపథ్యంలో.. సర్వత్రా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సిట్టింగ్‌లలో కొందరికి మళ్లీ సీటు దక్కదనే ఊహాగానాలు బలంగా వినిపిస్తుండడం.. దీనికి తోడు 105 స్థానాలకే ప్రకటిస్తారనే ప్రచారం నేపథ్యంలో.. జాబితాలో ఎవరుంటారనే ఉత్కంఠ బీఆర్‌ఎస్ శ్రేణుల్లో నెలకొంది.
అయితే సిట్టింగ్‌లకు గులాబీ బాస్ హ్యాండ్ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. 2018 ఎన్నికల సమయంలోనూ ఆయన కొందరు సిట్టింగ్‌లను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. ఆ జాబితాను పరిశీలిస్తే..
ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించి.. ఓరుగల్లు రాజకీయాల్లో పట్టున్న కొండా సురేఖకు తిరిగి అవకాశం ఇవ్వలేదు కేసీఆర్. అలాగే.. వికారాబాద్, ఆందోల్, చొప్పదండి, చెన్నూరూ రిజర్వ్‌డ్ స్థానాల క్యాండిడేట్లను సైతం పక్కన పెట్టేశారు. అప్పటి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మేడ్చల్, మల్కాజ్‌గిరి స్థానాల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం తిరిగి టికెట్లు కేటాయించలేదు.
Comments
Please login to add a commentAdd a comment