సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించిన స్ఫూర్తితో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ సికింద్రాబాద్ ఎంపీని భారీ మెజారీ్టతో గెలిపించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో జరిగిన హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురు సభ్యులతో మాట్లాడిన కేటీఆర్ పార్టీ పరిస్థితి తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మన పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారు.
వారందరికీ రెండు లక్షలకుపైగా మెజార్టీ ఓట్లు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లోనూ సులభంగానే గెలిచే అవకాశాలున్నాయి. ఇప్పటివరకున్న రికార్డుల్ని బ్రేక్ చేసేందుకు మరింత కష్టపడాలి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో లేమని నిరాశ చెందవద్దు. పక్క పారీ్టవాళ్ల ప్రలోభాలకు లొంగవద్దు. రాజీలేని పోరాటంతో విజయం సాధిస్తాం. మళ్లీ గెలుపు మనదే. అవసరమైతే హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలోనూ గెలిచేలా తయారు కావాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీతో అయ్యేదేమీ లేదని, మళ్లీ పోరాట పటిమతో మన సత్తా చాటాలన్నారు.
ప్రజలు పోరాడేలా చేయండి
కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు సాధ్యం కాదని, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, అమలు చేయకపోతే తిరగబడేలా చైతన్యం తేవాలని కేటీఆర్ సూచించారు. అభయహస్తం కింద దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువమంది పెన్షన్‌కు అర్హులుంటే ఎంతమందికి వర్తింపజేస్తారో పరిశీలించాలని సూచించారు.
సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికమని చెబుతున్నప్పటికీ, రేషన్‌కార్డులు లేని వారికి ఎప్పటిలోగా ఇస్తారో ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. వాటితోపాటు ప్రజల నుంచి అందిన ఇతర ఫిర్యాదులనూ ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదని, ఈ ప్రక్రియలన్నీ ముగిసి ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు ఎంత సమయం పడుతుందో తెలియదని చెబుతూ వీటన్నింటినీ ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకెళ్లి వారు పోరాడేలా చేయాలని చెప్పారు. సమీక్ష సమావేశాలను తేలికగా తీసుకోవడం మంచిది కాదని, భద్రాచలం నుంచి వచి్చన నేతలు సమావేశం ఆసాంతం ఉండగా.. నగర నాయకులు మాత్రం మాట్లాడి వెళ్లిపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment