
సాక్షి,హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపుతోందని, దాడికి పాల్పడ్డ అక్రమార్కులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం(అక్టోబర్ 14) కేటీఆర్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.
‘ఇలాంటి తెలివితక్కువ చర్యలు మన నగరం యొక్క సహనశీలతకు మచ్చ. గడిచిన నెలరోజులుగా శాంతిభద్రతలు దిగజారుతున్నాయని,దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేటీఆర్ హెచ్చరించారు.
ఇదీ చదవండి: సికింద్రాబాద్ కుమ్మరిగూడలో ఉద్రిక్తత