సీబీఎస్‌ఈలో ‘గ్రేటర్‌’ విద్యార్థుల హవా | Greater Hyderabad students top in the CBSE | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈలో ‘గ్రేటర్‌’ విద్యార్థుల హవా

Published Sun, Jun 4 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

Greater Hyderabad students top in the CBSE

సాక్షి, హైదరాబాద్‌: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) పదో తరగతి ఫలితాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ విద్యార్థులు ఎక్కువ మంది పదికి పది గ్రేడ్‌లు సాధించారు. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ నుంచి పరీక్షకు హాజరైన 149 మంది విద్యార్థుల్లో 78 మంది ఏ–1 గ్రేడ్‌ సాధించగా ఇందులో 43 మంది 10/10 జీపీఏతో తమ ఘనతను చాటుకున్నారు. ఇక ఆంధ్ర మహిళా సభ పి.ఓబుల్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్లో 193 మంది విద్యార్థుల్లో 20 శాతం మంది, భారతీయ విద్యాభవన్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యాశ్రమంలో 263 మంది విద్యార్థుల్లో 81 మంది 10/10 సీజీపీఏ సాధించి స్కూల్‌ టాపర్లుగా నిలిచారు.

మెరీడియన్‌ స్కూల్‌లో 46 మంది విద్యార్థులు 10/10 సీజీపీఏతో జయకేతనం ఎగుర వేశారు. సనత్‌నగర్‌ హిందూ పబ్లిక్‌ స్కూల్‌లో 189 మంది విద్యార్థుల్లో 37 మంది, హిమాయత్‌నగర్‌ ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ హైస్కూల్‌కు చెందిన నేహా అంజుమ్, మానిష్‌ కుమార్‌దాస్‌లు పదికి పది పాయింట్లు సాధించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement