సాక్షి హైదరాబాద్: గ్రేటర్ జిల్లాల్లో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గురువారం ఒక్కరోజే 1,588 కేసులు నిర్ధారణ అయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,214 మేడ్చల్ జిల్లాలో 161, రంగారెడ్డి జిల్లాల్లో 213 మంది వైరస్ బారిన పడటం ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన వారిలో తీవ్రమైన లక్షణాలేవీ లేకపోవడం, సాధారణ దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు మాత్రమే కన్పిస్తుండటం ఊరటనిచ్చే అంశంగా వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో కోవిడ్ చికిత్సలకు కేంద్రమైన గాంధీ, టిమ్స్, కింగ్‌కోఠి, ఫీవర్, ఛాతీ ఆస్పత్రి, నిలోఫర్ సహా అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో పని చేస్తున్న వైద్య సిబ్బంది సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. అత్యవసరమైతే మినహా సాధారణ కారణాలకు సెలవులను మంజూరు చేయకూడదని ఆయా ఆస్పత్రులకు సూపరింటెండెంట్లకు తెలంగాణ వైద్యవిద్య సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు.
(చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ వేసి కటకటాల్లోకి..!)
Comments
Please login to add a commentAdd a comment