
నిజామాబాద్ అర్బన్: కోడి ధర కొండెక్కింది. చికెన్ ధర ఒక్కసారిగా రూ. 270కి చేరింది. వారం వ్యవధిలో రూ.50 పెరగడం గమనార్హం. నిజామాబాద్‌లో గత వారం స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.220. అయితే, ఆదివారం ఒక్కసారిగా రూ.50 పెంచేసి రూ.270కి కిలో చొప్పున విక్రయించారు. ఎండలు మండిపోతున్న తరుణంలో కోళ్ల దిగుమతి తగ్గిపోయిందని, అందుకే ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు.
వడగాలుల తీవ్రతకు పౌల్ట్రీ ఫామ్‌లలో కోళ్లు చనిపోతున్నాయంటున్నారు. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. చికెన్ ధర పెరుగుతుండడంతో మాంస ప్రియులు ఆందోళన చెందుతున్నారు.