బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ ప్రశాంతి
నిర్మల్‌అర్బన్ : ప్రజావాణికి వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ ప్రశాంతి గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ సోమవా రం నిర్వహించే ప్రజావాణికి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. దరఖాస్తులను కేటగిరీల వారీగా తీసుకుని ‘ఎ’ కేటగిరి కింద వచ్చిన దరఖాస్తులకు వారంరోజుల్లో సమాధానం ఇవ్వాలన్నారు. ఆసరా పింఛ న్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు కార్యాలయానికి అందగా నే, వాటి నివేదికను వారం రోజుల్లోగా అందజేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ప్రజాఫిర్యాదులను సమీ క్షించారు. వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. దాదాపు 30 వినతులు రాగా, అందులో అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టుల నియామకాల్లో అన్యాయం జరిగిందంటూ అందిన అర్జీలే ఎక్కువగా ఉండడం గమనార్హం. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఏరి యాస్పత్రి సూపరింటెండెంట్ సురేశ్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి బాల సురేందర్, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ దేబ్ జాని ప్రమానిక, ఆర్డీవో ప్రసూనాంబా, డీఎంహెచ్‌వో జలపతినాయక్ తదితరులున్నారు.
గుడిసెలు ఖాళీ చేయమంటుండ్రు
1309 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిలో 20 ఏళ్లుగా నివాసముంటున్నాం. రెండేళ్లుగా కొందరు గుడిసెలు ఖాళీ చేయమంటుండ్రు. ప్రభుత్వ భూమిని తమ భూమిగా చెబుతుండ్రు. మా నిరుపేదల గుడిసెలు ఖాళీ చేయించకుండా చూడాలి.
– నిర్మల్‌లోని శాంతినగర్‌వాసులు
Comments
Please login to add a commentAdd a comment