problems clears
-
మైండ్ హెల్త్: పల్లె మహిళే మెరుగు..
పల్లె మహిళ పట్టణ మహిళను దాటి ముందుకెళుతుందా?! ‘అవును’ అనే అంటున్నారు మానసిక నిపుణులు. సమస్యలు ఎదురైనా ఏ మాత్రం జంకక పరిష్కార దిశగా అడుగు వేయడంలో పల్లె మహిళే పట్టణ మహిళ కన్నా ముందంజలో ఉందని పెన్సిల్వేనియా ఉమెన్ హెల్త్ స్టడీ ఓ నివేదికను రూపొందించింది. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న పట్టణ–గ్రామీణ మహిళలపై వీరు చేసిన స్టడీ ద్వారా ఆసక్తికర విషయాలు తెలియ జేశారు. మానసిక సమస్యలు గ్రామీణ మహిళ కన్నా పట్టణ మహిళల్లో ఎక్కువ శాతం ఉన్నట్టు గమనించారు. దీనికి సంబంధించిన కారణాలను విశ్లేషించారు. పల్లె జీవనమే సాంత్వన ‘పట్టణ మహిళ కుటుంబంలో ఉన్నప్పటికీ మానసికంగా ఒంటరితనాన్నే ఫీలవుతుంది. వచ్చిన ఆదాయానికి, పెరుగుతున్న ఖర్చులకు పొంతన ఉండదు. ఇంటర్నెట్ వాడకం కూడా ఇందుకు కారణమే. పల్లెల్లోనూ ఈ ప్రభావం ఉన్నప్పటికీ అక్కడ శారీర శ్రమకు సంబంధించిన పనులు ఎక్కువ. దీనికి తోడు వెన్నంటి భరోసాగా ఉండే వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. తమ సమస్యలను తమలోనే దాచుకుని బాధపడరు. చుట్టుపక్కల ఇళ్ల వారిలో ఎవరికో ఒకరికి చెప్పుకుని ఊరట పొందుతారు. అక్కడ అవకాశాలు తక్కువ. అలాగే, అసంతృప్తులూ తక్కువే’ అంటారు క్లినికల్ సైకాలజిస్ట్ రాధిక. ఎప్పుడైతే సెన్సిటివ్‌గా, సమస్యలు లేకుండా పెరుగుతారో వారిలో అభద్రతా భావం ఎక్కువ అంటారు నిపుణులు. పల్లెల్లో చిన్నప్పటి నుంచే కష్టపడే తత్త్వం ఉంటుంది. ఇంటి పనులు, బయట పనులు ఒక అలవాటుగా చేసుకుపోతుంటారు. తమకు అవి కావాలనీ, ఇవి కావాలనీ అంచనాలు, ఆశలు పెద్దగా ఉండవు. శారీరకపరమైన పనుల్లో కలిగే అలసట మనసును కూడా సేద తీరుస్తుంది. వాస్తవానికి దగ్గరగా ఉండేలా చేస్తుండటం కూడా మానసిక సమస్యలను దూరం చేస్తుందంటారు నిపుణులు. యాక్సెప్టెన్సీ ఎక్కువ వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండటం వల్ల దేనిమీదా ఎక్కువ ఆశలు పెట్టుకోరు. అవి తమ జీవిత భాగస్వామి నుంచైనా సరే. ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి.. అనే విషయాల పట్ల సరైన అవగాహన ఉంటుంది. రిసోర్స్ మేనేజ్మెంట్ పల్లెవాసులకే బాగా తెలుసు. అందుకే ఎక్కువ ఒత్తిడికి లోనవరు. వారికి వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే సమస్యలే అధికం. మిగతావన్నీ వాటి ముందు చిన్నవిగానే కనిపిస్తాయి. పిల్లలకు కూడా ఆ వాస్తవాన్ని పరిచయం చేస్తారు. ఇల్లు, సమాజం నేర్పే పాఠాలు వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచుతాయి. పట్టణప్రాంతాల్లో అవకాశాలు కోకొల్లలు. వాటి వల్ల వచ్చే సమస్యలు అంతే! అవి అందరికీ అందుబాటులో ఉండవు. వాటిని అందుకోవడం కోసం ఎలా పరుగులు పెట్టాలా అనే ఆలోచనతో ఉంటుంది పట్టణ మహిళ. తన చుట్టూ ఉన్నవారితో పోల్చుకోవడంతో తనను తాను తక్కువ చేసుకుంటుంది. ఫలితంగా రోజు రోజుకూ తనపై తనకు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. పల్లెటూరులో ఉన్నవాళ్లు కదా వాళ్లకేం తెలుసు అనేది పట్టణవాసుల అలోచన. కానీ, పల్లెటూరులో ఎప్పుడూ కష్టమే ఉంటుంది. వాటిని ఎదుర్కొనే సమర్థతా ఉంటుంది. నీడపట్టున ఉండే నగరవాసులే కష్టాన్ని ఎదుర్కోలేని సున్నితత్త్వం ఉంటుంది. పట్టణ మహిళ మారాలి పల్లెటూరులో ఉన్నప్పుడు ఏడుపు వస్తే పరిగెత్తుకెళ్లి అమ్మ ఒడిలో తలదాచుకోవడం తెలుసు. చెట్టు కింద సేద తీరడం తెలుసు. మట్టికి దగ్గరగా ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని తెలుసు. పట్టణ జీవనంలో ఎవరికి వారే. ఎవరితోనూ పంచుకోలేని సమస్యలు. కష్టాలు వస్తే ఎదుర్కొనే ధైర్యం సన్నగిల్లుతోంది. అందుకే, ముందు ఇంట్లో మహిళ మనస్తత్వం మారాలి. నెలకు ఒకసారైనా పట్టణం వదిలి, పల్లె వాతావరణంలోకి వెళ్లగలగాలి. ఒత్తిడి దశలను దాటే మార్గాలను పల్లెలే పరిచయం చేస్తాయని గ్రహించాలి. స్వచ్ఛందంగా సమాజానికి ఏ చిన్న పని చేసినా, మానసిక సాంత్వన లభిస్తుందని గ్రహించాలి. పిల్లలకు కూడా ‘నేను పడిన కష్టాన్ని నా పిల్లలు పడకూడదు’ అనుకోకుండా వారికి మన భారతీయ మూలాలను తెలియజేయాలి. – రాధిక ఆచార్య, క్లినికల్ సైకాలజిస్ట్ -
మహిళకు సు‘భద్రతా’ వాహిని
సాక్షి, తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర) : రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం ముకుల్ శరణ్మాథుర్ తెలిపారు. సోమవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రైల్వే భద్రతా దళం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఆర్పీఎఫ్, కమర్షియల్ సిబ్బందితో ప్రత్యేక రక్షణ విభాగం ‘సుభద్ర వాహిని’ని ఆయన సోమవారం ప్రారంభించారు. సుభద్ర వాహినికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆయన ప్రారంభించారు. ఈ టీమ్‌లో 10 మంది ఆర్పీఎఫ్ సిబ్బంది, 10 మంది మహిళా టికెట్ తనిఖీ సిబ్బంది ఉంటారు. ఈ టీమ్‌కు ప్రత్యేక డ్రెస్‌ను కూడా ఆవిష్కరించి వారికి అందజేశారు. ఈ సందర్భంగా శరణ్మాథుర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రత్యేకంగా కేటాయించిన టోల్‌ఫ్రీ నంబరు 182ను ఏ సమయంలోనైనా వినియోగించి ఫిర్యాదులు అందజేయవచ్చన్నారు. రైళ్లల్లో మహిళలకు ఎదురైయ్యే సమస్యలను ఈ బృందం పరిష్కరించడంలో సహకరిస్తారన్నారు. రైళ్లలో గానీ, రైల్వేస్టేషన్లలో గానీ మహిళలకు ఇబ్బందులు ఎదురుకాకుండా వీరు పని చేస్తుంటారు. ఒకొక్కసారి పురుష భద్రతా అధికారులకు ఫిర్యాదు చేయడానికి మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే వాల్తేరు డివిజన్లో మొట్టమొదటిసారిగా సుభద్రవాహిని టీంను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దేశంలోనే ఇటువంటి టీంను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని ఆయన తెలిపారు. ఈ కమిటీలో సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్(ఆర్పీఎఫ్), సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్లు సభ్యులుగా ఉన్నారు. ఎవరైనా 182 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని, లేదా వాట్సాప్ నెంబరు 8978080777కు ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ విధంగా అందిన ఫిర్యాదులకు వెంటనే సమీప ఆర్పీఎఫ్ సిబ్బందికి చేరవేయడం ద్వారా వారిని అప్రమత్తం చేస్తారని, తద్వారా వెంటనే తప్పు చేసిన వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సీనియర్ డీఎస్పీ జితేంద్ర శ్రీ వాత్సవ, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అశోక్‌కుమార్, సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చారుమతి, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అర్జీలు వెంటనే పరిష్కరించాలి
నిర్మల్అర్బన్ : ప్రజావాణికి వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ ప్రశాంతి గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ సోమవా రం నిర్వహించే ప్రజావాణికి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. దరఖాస్తులను కేటగిరీల వారీగా తీసుకుని ‘ఎ’ కేటగిరి కింద వచ్చిన దరఖాస్తులకు వారంరోజుల్లో సమాధానం ఇవ్వాలన్నారు. ఆసరా పింఛ న్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు కార్యాలయానికి అందగా నే, వాటి నివేదికను వారం రోజుల్లోగా అందజేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ప్రజాఫిర్యాదులను సమీ క్షించారు. వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. దాదాపు 30 వినతులు రాగా, అందులో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల నియామకాల్లో అన్యాయం జరిగిందంటూ అందిన అర్జీలే ఎక్కువగా ఉండడం గమనార్హం. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఏరి యాస్పత్రి సూపరింటెండెంట్ సురేశ్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి బాల సురేందర్, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ దేబ్ జాని ప్రమానిక, ఆర్డీవో ప్రసూనాంబా, డీఎంహెచ్‌వో జలపతినాయక్ తదితరులున్నారు. గుడిసెలు ఖాళీ చేయమంటుండ్రు 1309 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిలో 20 ఏళ్లుగా నివాసముంటున్నాం. రెండేళ్లుగా కొందరు గుడిసెలు ఖాళీ చేయమంటుండ్రు. ప్రభుత్వ భూమిని తమ భూమిగా చెబుతుండ్రు. మా నిరుపేదల గుడిసెలు ఖాళీ చేయించకుండా చూడాలి. – నిర్మల్‌లోని శాంతినగర్‌వాసులు -
కృష్ణమ్మ రైతుల వెలుగు రేఖ